ఓదెల‌-2 కోసం త‌మ‌న్నా త్యాగాలు!

తాజాగా ఇదే బాటాలో 'ఓదెల‌2' టీమ్ కూడా ప్ర‌య‌ణం చేస్తుంద‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.;

Update: 2025-04-15 05:36 GMT
ఓదెల‌-2 కోసం త‌మ‌న్నా త్యాగాలు!

బాలీవుడ్ లో `రామాయ‌ణం` మొద‌లైన నేప‌థ్యంలో అందులో రాముడి పాత్ర పోషిస్తున్న ర‌ణ‌బీర్ క‌పూర్ నియ‌మ నిష్ట‌ల‌తో షూటింగ్ లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. మాంసాహారిగా ఉన్న ర‌ణ‌బీర్ శాఖాహారిగా మారిపోయాడు. మ‌ద్యానికి దూర‌మయ్యాడు. చెప్పులు ధ‌రించ‌కుండానే షూటింగ్ కి హాజ‌ర వుతున్నాడు. షూటింగ్ లో అవ‌స‌ర‌మైతేనే పాద‌ర‌క్ష‌లు ధ‌రిస్తున్నాడు. ఇలా ఉండాల‌ని ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ ఎలాంటి కండీష‌న్లు పెట్ట‌లేదు.

రామాయ‌ణం ప్రాముఖ్య‌త‌, ప్రాధాన్యత తెలుసుకుని ర‌ణ‌బీర్ క‌పూర్ ఈ నిర్ణ‌యంతో ముందుకెళ్తున్నాడు. సీత పాత్ర పోషిస్తున్న సాయి ప‌ల్ల‌వి ప్యూర్ వెజిటేరియ‌న్ కావ‌డంతో ఆ ర‌క‌మైన ఇబ్బందులు త‌లెత్త‌లేదు. అలాగే చిత్ర ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ కూడా సినిమా రిలీజ్ వ‌ర‌కూ అంతే శుద్దిగా ఉండాల‌ని నిర్ణయించుకుని ప‌నిచేస్తున్నాడు. తాజాగా ఇదే బాటాలో 'ఓదెల‌2' టీమ్ కూడా ప్ర‌య‌ణం చేస్తుంద‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

త‌మన్నా ప్ర‌ధాన పాత్ర‌లో సంప‌త్ నంది ర‌చించిన స్టోరీ ఇది. ప్రేతాత్మ‌కు-పంచాక్ష‌రి మ‌ధ్య జ‌రిగే యుద్ద‌మే ఈ చిత్రం. ఇందులో త‌మ‌న్నా మెయిన్ లీడ్ పోషిస్తుంది. త‌మ‌న్నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండ బోతుంది. ప్రేతాత్మ‌తో త‌మ‌న్నా ఎలాంటి పోరాటం చేసింద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. నాగ సాధువు పాత్ర‌లో త‌మ‌న్నా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం త‌మ‌న్నా క‌ఠిన నియ‌మాలే ఆచ‌రించిన‌ట్లు సంప‌త్ నంది తెలిపారు.

షూటింగ్ జ‌రిగినంత కాలం త‌మ‌న్నా చెప్పులు ధ‌రించ‌లేదట‌. ఎండ‌లో సైతం చెప్పులు లేకుండా న‌డ‌వ‌డం వ‌ల్ల సాయంత్రానికి పాదాలు బొబ్బలు క‌ట్టేవ‌ట‌. ఎర్ర‌గా కందిపోయి పుళ్లు ప‌డేవ‌ట‌. అయినా త‌మ‌న్నా ఆ బాధ‌ను లెక్క చేయ‌కుండా షూటింగ్ లో పాల్గొనేద‌ని తెలిపారు. అప్ప‌టికే త‌మ‌న్నా ఆథ్యాత్మిక ప్ర‌యాణంలో ఉండ‌టం వ‌ల్ల ఈ పాత్ర‌కు ఈజీగా మారింద‌న్నారు. సినిమా కోసం శాఖాహారిగాను మారిపోయిందట‌. త‌మ‌న్నాను చూసి త‌మ టీమ్ అంతా కూడా ఆమెనే ఫాలో అయిన‌ట్లు తెలిపారు.

Tags:    

Similar News