ఆ వీడియోతో తమన్నా బ్రేకప్ కన్ఫర్మ్ అయినట్టేనా?
అయితే ఈ వీడియో మొత్తంలో ఎక్కడా తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ కనిపించలేదు.;

ప్రస్తుతం ముంబైలో నవరాత్రులు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సినీ నటి తమన్నా తన ఇంట్లో మాతా కీ చౌకీ నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రుల్లో భాగంగా మాతా కీ చౌకీ చేస్తారు. పూజ పూర్యయ్యాక తమన్నా తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ పూజా కార్యక్రమాల్లో తమన్నా ఫ్రెండ్, రవీనా టాండన్ కూతురు రషా తదానీ కూడా హాజరై ఇద్దరూ కలిసి డ్యాన్సులేశారు. వారిద్దరూ కలిసి పూజ అనంతరం వేసిన డ్యాన్సులు తమన్నా షేర్ చేసిన వీడియోలోనే హైలైట్ గా నిలిచాయి. రషా తదానీ, తమన్నా ఎంతో కాలంగా ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. అందుకే మొన్న రషా ఇంట్లో ఏర్పాటు చేసిన హోళీ వేడుకలకు తమన్నా కూడా హాజరైంది.
అయితే ఈ వీడియో మొత్తంలో ఎక్కడా తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ కనిపించలేదు. దీంతో బాలీవుడ్ లో వీరి బ్రేకప్ పై వస్తున్న వార్తలు నిజమేననిపిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం ఓదెల2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా నాగసాధువుగా కనిపించనుంది. అశోక్ తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.