ఓదెలా 2: తమన్నా భాటియా పవర్ఫుల్ లుక్కుతో 2వ అడుగు!

ఇక వీడియోలో తమన్నా అఘోరా పాత్రలో మంచి థ్రిల్ ను కలిగిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంత పవర్ఫుల్ పాత్రలో ఆమె దర్శనమివ్వబోతోంది.

Update: 2024-04-26 06:57 GMT

‘ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఓదెల 2 సినిమాను మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్స్ గ్రాండ్ గా తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాస్ ఫిల్మ్ మేకర్ సంపత్ నంది క్రియేషన్ లో ఓదెల రైల్వే స్టేషన్ ఫేమ్ అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్ మంచి హైప్ క్రియేట్ చేసింది. భైరవి అనే నాగ సాధువుగా తమన్నా భాటియా కనిపించనుంది.

 

ఈ సినిమా షూటింగ్ భారతదేశంలోని వివిధ సుందరమైన ప్రదేశాలలో తన మొదటి షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక మహాదేవ్ పరమశివుని దివ్య ఆశీస్సులతో ఆయన పవిత్ర నివాసం వారణాసిలో మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. ప్రారంభ షెడ్యూల్‌లో వారణాసి, హైదరాబాద్, భూధాన్ పోచంపల్లి, పోతారం మరియు టంగటూర్ గ్రామాలలో షూటింగ్ నిర్వహించారు.

ఇక మొదటి విడత చిత్రీకరణ పూర్తవడంతో, రెండవ షూట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాదు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతోందని ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. 25 రోజుల వ్యవధిలో జరగనున్న ఈ షెడ్యూల్ సినిమాలోని ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇక వీడియోలో తమన్నా అఘోరా పాత్రలో మంచి థ్రిల్ ను కలిగిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంత పవర్ఫుల్ పాత్రలో ఆమె దర్శనమివ్వబోతోంది. ఆమె అడుగు పడగానే దానికి తగ్గట్టుగా వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో తమన్నా భాటియాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.

కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆశీస్సులతో రెండవ షూట్ షెడ్యూల్ కొనసాగుతున్నట్లు చెప్పిన మేకర్స్, అసమానమైన సినిమాటిక్ అనుభూతిని అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అలాగే ప్రేక్షకులకు "ఒదెల 2" మేకింగ్ గురించి రెగ్యులర్ అప్‌డేట్‌లు అందుతాయని అన్నారు.

ప్రతి యుగంలో దేవుడు తన ప్రజలను రక్షించడానికి చెడుపై ఎలా గెలుస్తాడో చూపిస్తూ "ఓదెల 2" థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను హైలెట్ చేయనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సౌందర్‌రాజన్, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్ గా సినిమాకి వర్క్ చేస్తున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

Full View
Tags:    

Similar News