ప్రభాస్‌ 'కల్కి' రిలీజ్ డేట్ మరింత స్పష్టత

అందరికీ తాజాగా తమ్మారెడ్డి భరద్వాజా వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది.

Update: 2023-07-24 08:12 GMT

ప్రభాస్‌ ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 'కల్కి 2898 ఏడీ' టైటిల్‌ సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది అనడంలో సందేహం లేదు. ప్రభాస్ లుక్ తో పాటు హీరోయిన్ దీపికా పదుకునే లుక్‌ సినిమా పాన్ వరల్డ్‌ మూవీ అన్నట్లుగా మాట్లాడుకునేలా చేసింది. కల్కి సినిమా రిలీజ్ పై ఆసక్తికర చర్చ ప్రారంభం అయింది.

గ్లిమ్స్ రిలీజ్ కి ముందు వరకు 2024 సంక్రాంతి కి సినిమా రాబోతుంది అన్నట్లుగా అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. రిలీజ్ డేట్ ను గత ఏడాది ప్రకటించడంతో సంక్రాంతి కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ గ్లిమ్స్ లో సినిమా రిలీజ్ డేట్‌ పై అనుమానం కలిగే విధంగా సంక్రాంతికి అంటూ టైటిల్ కార్డ్ వేయలేదు.

దానికి తోడు గ్లిమ్స్ ను షేర్ చేసిన రాజమౌళి రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నట్లుగా యూనిట్‌ సభ్యులను సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించాడు. దాంతో కొత్త రిలీజ్ డేట్ రావచ్చు అనే ఊహాగానాలకు తెర లేచింది. కొందరు మాత్రం ఇంకా వచ్చే ఏడాది సంక్రాంతికి కల్కి వస్తుందనే నమ్మకంతో వెయిట్‌ చేస్తున్నారు. అందరికీ తాజాగా తమ్మారెడ్డి భరద్వాజా వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది.

వైజయంతి మూవీస్ కి సాన్నిహిత్యంగా ఉండే తమ్మారెడ్డి భరద్వాజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి 2898 ఏడీ సినిమా ఓ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది... ఇండియన్ సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కినట్లు అవుతుందని పేర్కొన్నాడు. ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావించినప్పటికీ షూటింగ్.. వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతున్న కారణంగా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు.

ఆయనకు తెలిసిన సమాచారం ప్రకారం 2024 సమ్మర్‌ లో సినిమా విడుదల అవ్వబోతుంది. సమ్మర్‌ ఆరంభంలోనే అంటే ఏప్రిల్ లేదా మే నెలలో కల్కి సినిమా విడుదల అవ్వబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యుల నుండి స్పష్టత రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది.

రెండు పార్ట్‌ లకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను ముగించిన తర్వాత మాత్రమే మొదటి పార్ట్‌ విడుదల తేదీ ని మరోసారి అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కల్కి 2898 ఏడీ ఒక టైమ్‌ ట్రావెల్ కాన్సెప్ట్‌ మూవీ అని ఇన్నాళ్లు ప్రేక్షకుల మధ్య చర్చ జరిగింది. కానీ ఇది అంతకు మించి విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్లు గ్లిమ్స్ ను చూస్తే అనిపిస్తుంది.

Tags:    

Similar News