న‌ల్ల స‌ముద్రంపై తార‌క్- ప్ర‌శాంత్ అతిపెద్ద యుద్ద‌మే!

ఇప్ప‌టికే దానికి సంబంధించిన ప‌నుల్లో ప్ర‌శాంత్ నీల్ బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు దారి తీసింది.

Update: 2024-09-08 06:35 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయకుడిగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా స్టోరీ ఏంటి? అన్న‌ది ఇంకా ఎక్క‌డా లీక్ అవ్వ‌లేదు. ప్ర‌శాంత్ గ‌త చిత్రాలు 'కేజీఎఫ్‌'..'స‌లార్' తో పోల్చితే తార‌క్ తో అంత‌కు మించే ప్లాన్ చేస్తాడు? అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇప్పుడు తార‌క్ పాన్ ఇండియా స్టార్ కాబ‌ట్టి ఆ రెండు చిత్రాల‌కు భిన్నంగా స‌రికొత్త ప్ర‌యోగ‌మే చేస్తాడ‌ని అంతా గెస్ చేస్తున్నారు.

ఈనేప‌థ్యంలో ప్ర‌శాంత్ నీల్ స్టోరీ ప‌రంగా ఎలాంటి పాయింట్ ని ట‌చ్ చేస్తున్నాడు? అన్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కానీ ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి లీకు బ‌య‌ట‌కు రాలేదు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లు కానుంది. ఇప్ప‌టికే దానికి సంబంధించిన ప‌నుల్లో ప్ర‌శాంత్ నీల్ బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ ద్వ‌యం తొలి షెడ్యూల్ ఏకంగా న‌ల్ల స‌ముద్రంపైనే ప్లాన్ చేస్తున్నారుట‌. అక్క‌డ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించేలా తొలి షెడ్యూల్ రెడీ చేస్తున్నారుట‌. అదే గ‌నుక నిజ‌మైతే అది సంచ‌ల‌న‌మే. ఇంత‌కీ న‌ల్ల స‌ముద్రం ఎక్క‌డ ఉంది? అంటే? ఐరోపా ఖండంలో గ‌ల‌దు. ఇది ఆగ్నేయ ఐరోపా ఖండంలోని ఒక బాల్కన్ దేశం అదే బల్డేరియా.

ఈ దేశానికి ఉత్తరాన రొమేనియా, పశ్చిమాన సెర్బియా, ఉత్తర మేసిడోనియా, దక్షిణాన గ్రీస్, టర్కీ దేశాలు సరిహద్దుగా ఉన్నాయి. ఈ దేశపు తూర్పు ప్రాంతాన్న‌ నల్ల సముద్రం ఉంది. బ‌ల్గేరియాలో ఓ లాంగ్ షెడ్యూల్ ఉందిట‌. స్టోరీలో భాగంగానే న‌ల్ల స‌ముద్రంపై భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా షూట్ చేయాల్సి వ‌స్తోందిట‌. ఇవి ఎంతో సాహ‌సంతో కూడిన స‌న్నివేశాలుగా లీకులందుతున్నాయి. ప్ర‌శాంత్ నీల్ సినిమాలు యూనిక్ గా ఉంటాయ‌ని చెప్పాల్సిన పనిలేదు. వాటిలో హీరో..విల‌న్ కూడా అదే రేంజ్ లో హైలైట్ అవుతుంటారు.

Tags:    

Similar News