డెవిల్ ఈవెంట్‌కి తార‌క్ అందుకే రాలేక‌పోతున్నారా?

డిసెంబ‌ర్ 29న భారీ అంచ‌నాల మ‌ధ్య డెవిల్ రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Update: 2023-12-24 09:50 GMT

నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ క‌ళ్యాణ్ రామ్- ఎన్టీఆర్ మ‌ధ్య అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మ సినిమాల‌కు సంబంధించి ఏ వేడుక జ‌రుగుతున్నా అన్న‌ద‌మ్ములిద్ద‌రూ త‌ప్ప‌క పాల్గొంటారు. ఒక‌రి ఈవెంట్ల కు మ‌రొకరు విచ్చేసి సినిమాకి కావాల్సినంత ప‌బ్లిసిటీ ఇస్తుంటారు. అన్న‌ద‌మ్ములిద్ద‌రినీ అలా చూసి అభిమానులు అంతే మురిసిపోతుంటారు. ఈ నేప‌థ్యంలో డెవిల్ ఈవెంట్ లో అన్న‌ద‌మ్ములిద్ద‌ర్నీ ఒకే వేదిక‌పై చూడ‌టానికి అభిమానులు రెడీ అవుతున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ క‌ల‌యిక‌కు స‌మ‌యం ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.

డిసెంబ‌ర్ 29న భారీ అంచ‌నాల మ‌ధ్య డెవిల్ రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈసారి ఆ ఛాన్స్ అభిమానులు మిస్ అవుతున్నట్లే క‌నిపిస్తుంది. డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హాజ‌ర‌య్యే అవ‌కాశం లేద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. ఫ్యామిలీతో వెకేష‌న్ ప్లాన్ చేసుకుంటున్నందున‌ తార‌క్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉండ‌ద‌ని భావిస్తున్నారు. పిల్ల‌ల స్కూళ్ల‌కు..ఆయ‌న‌కి ఈ సీజ‌న్ లో సెల‌వులు దొర‌క‌డంతో ఈసారి అన్న‌య్య‌కి సారీ చెప్పి త‌మ్ముడు ప్లైట్ ఎక్కేస్తున్నాడ‌ని స‌మాచారం.

క్రిస్మ‌స్..న్యూఇయ‌ర్ సందర్భంగా ఎక్కువ రోజులు సెలువులు ఉండ‌టంతో తార‌క్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. స‌హ‌జంగా డిసెంబ‌ర్ నెల అంటే వెకేష‌న్ల‌కు సీజ‌న్ గా భావిస్తుంటారు. సెల‌బ్రిటీలు కుటుంబాల‌తో ఎక్కువ‌గా విదేశాలు వెళ్తుంటారు. క్రిస్మ‌స్..న్యూ ఇయ‌ర్ వేడుక‌లు విదేశాల్లో సెల‌బ్రేట్ చేసుకుని ప్రెష్ గా కొత్త సంవ‌త్స‌రంలో స్వ‌దేశంలోకి అడుగు పెడుతుంటారు. ఈసారి తార‌క్ కూడా అలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

డెవిల్ ఈవెంట్..తార‌క్ వెకేష‌న్ రెండూ అప్ప‌టిక‌ప్పుడు ప్లాన్ చేసుకోవ‌డంతోనూ ఈ క్లాష్ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. లేదంటే తార‌క్ డెవిల్ ఈవెంట్ కి త‌ప్ప‌క హాజ‌ర‌య్యే వార‌ని తెలుస్తోంది. అలాగే కొన్ని నెల‌లుగా తార‌క్ దేవ‌ర షూటింగ్ లో కూడా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూట్ ప్రారంభ‌మైన దగ్గ‌ర నుంచి విరామం లేకుండా పనిచేస్తున్నారు. ఈ కార‌ణంగానూ త‌ప్ప‌క వెకేష‌న్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి దీనికి సంబంధించి మ‌రింత క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News