తరుణ్ భాస్కర్ అప్పడప్పడ తాండ్ర వచ్చేసిందోచ్
మొదటి ప్రయత్నంలోనే ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా, అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్స్‌గా మహాసముద్రం అనే సినిమాను చేశారు.
హీరయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మంగళవారం. అజయ్ భూపతి దర్శకుడు. ఆర్ఎక్స్ 100 వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్నసినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన మూవీ టీమ్.. తాజాగా మరో మాస్ బీట్ సాంగ్‌ను రిలీజ్ చేసింది.
ఏమైందో ఏమిటో, గంగన మోగాలిరా వంటి సాంగ్స్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా నుంచి అప్పడప్పడ తాండ్ర.. ఆవకాయ తాండ్ర లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో పెళ్లి చూపులు ఫేమ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ ప్లే చేశారు. నటుడు లక్ష్మణ్‌తో కలిసి చిందులేశారు. గ్రామంలోని సీక్రెట్ అఫైర్స్ గురించి మాట్లాడుతూ సాగిన సాంగ్ లిరిక్స్‌కు చిందులేశారు.
వీరిద్దరి హావాభావాలు, లుక్స్ మాస్ లుక్‌లో బాగా ఆకట్టుకున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను అద్భుతంగా ఆలపించగా.. అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం చాలా బాగుంది. గణేశ్ లిరిక్స్ అందించారు. తెలుగు, తమిళం, మలయాళం. కన్నడ, హిందీ భాషల్లో నవంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది.
సినిమాలో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ సస్పన్స్గా పెట్టారు. ఇప్పటివరకు క్లారిటీగా రివీల్ చేయలేదు. ట్రైలర్లో మాత్రం వేధింపులకు గురైన బాధితురాలిగా మాత్రం చూపించారు. ఇంకా అజయ్ ఘోష్, నందిత శ్వే, చైతన్య కృష్ణ, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సతీశ్, పృథ్వీ ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు. దశరథి సివేంద్ర సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. తజుద్దీన్ సయ్యద్, రాఘవ్ డైలాగ్స్ అందించారు. ముద్ర మీడియా, క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు.
కాగా, టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌లో అజయ్ భూపతి ఒకరు. మొదటి ప్రయత్నంలోనే ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా, అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్స్‌గా మహాసముద్రం అనే సినిమాను చేశారు. కానీ అది బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.
ఇప్పుడు మూడో సినిమాగా మంగళవారంతో రానున్నారు. అలాగే పాయల్ రాజ్‌పుత్‌కు కూడా ఈ మధ్య సరైన హిట్ దక్కలేదు. మరి ఈ మంగళవారం సినిమా ఎంతవరకు ఆకట్టుకుని, వీరిద్దరికి ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తుందో చూడాలి..