నేపాల్ లో 'మిరాయ్' భారీ యాక్షన్ సీక్వెన్స్!
`హనుమాన్` తో పాన్ ఇండియాలో సంచలనమైన యంగ్ హీరో తేజ సజ్జా మరో అదే తరహా ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే.
`హనుమాన్` తో పాన్ ఇండియాలో సంచలనమైన యంగ్ హీరో తేజ సజ్జా మరో అదే తరహా ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ` మిరాయ్ ` లో తేజ నటిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రమే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ క్రియేట్ అయింది. బలమైన కథ, కథనాలతో తెరకెక్కుతోన్న ఫాంటసీ థ్రిల్లర్ ఇది. ఇప్పటికే సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
ప్రస్తుతం చిత్రీకరణ నేపాల్ లో జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ కొన్నింటిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తేజ సహా ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటున్నారు. ఈ నేపాల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సన్నివేశాల్లో భాగంగా భౌదమతం గురించి కొన్ని విషయాలు చెప్ప బోతున్నారుట. యుద్ధ కళల్లో బౌధ మతం ప్రత్యేకత గురించి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే నేపాల్ లో షూటింగ్ చేస్తున్నారు. కొన్నిరోజుల పాటు ఎలాంటి గ్యాప్ లేకుండా నిరవధికంగా చిత్రీకరిస్తారని తెలిసింది. షూట్ లో భాగంగా కొన్ని నైట్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అవి ఛేజింగ్ తోకూడిన సన్నివేశాలని సమాచారం. అలాగే సినిమా రిలీజ్ పై కూడా స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకూ ఈసినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి వార్త బయటకు రాలేదు. సినిమా అప్ డేట్స్ కూడా అధికారికంగా ప్రకటించింది లేదు.
ఈ నేపథ్యంలో అన్నిపనులు పూర్తి చేసి సినిమాని జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. ఇందులో తేజ యోధ గా కనిపించనున్నాడు. అంటే యోధుడి పాత్రలో. హనుమాన్లో సూపర్ పవర్ ఉన్న పాత్రలోకనిపించగా...` `మిరాయ్` లో మాత్రం పూర్తి భిన్నంగా తానే ఓ బలమైన వ్యక్తి పాత్రలో మెప్పించబోతున్నాడు. ఈ పాత్ర కోసం తేజ కత్తి యద్దాలు, గుర్రపు స్వారీలపై కొంత శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.