బిగ్ బాస్ 8 : శనివారమే ఎలిమినేషన్.. ఆ కంటెస్టెంట్ అవుట్..!

బిగ్ బాస్ సీజన్ 8 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు.

Update: 2024-11-30 11:33 GMT

బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అంటే శనివారమే ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఈ క్రమంలో నేడు హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారన్నది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఐతే బిగ్ బాస్ నుంచి వచ్చే లీక్స్ ఆల్రెడీ ఎవరు ఎలిమినేట్ అన్నది తెలిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వచ్చిన తేజ ఆ సీజన్ లో 10 వారాలు ఉన్నాడు. ఐతే ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తేజ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం రోహిణి తప్ప మిగతా అందరు నామినేషన్స్ లో ఉన్నారు. దాదాపు టాప్ కంటెస్టెంట్స్ అంతా కూడా నామినేషన్స్ లో ఉండటం వల్ల తేజాకు లీస్ట్ ఓటింగ్ వచ్చింది. సీజన్ 7 లో ఎంటర్టైనింగ్ మాత్రమే చేసిన తేజ ఈ సీజన్ లో ఫిజికల్ టాస్క్ లో కూడా తన బెస్ట్ ఇచ్చాడు. ఐతే ఎంత చేసినా సరే ఆడియన్స్ దృష్టిలో మార్కులు సంపాదించలేదు.

ఐతే డబుల్ ఎలిమినేషన్ కాబట్టి తేజ ఎలిమినేషన్ ని శనివారమే నిర్వహించారు. హోస్ట్ నాగార్జున శనివారమే తేజాని హౌస్ నుంచి బయటకు పంపించారు. ఐతే తేజాతో పాటు మరొకరు కూడా ఆదివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అది ఎవరన్నది మాత్రం కాస్త సస్పెన్స్ నడుస్తుంది.

సీజన్ 8 లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా తేజా శనివారం ఎలిమినేట్ అవ్వగా సండే రోజు మరొకరు బయటకు వస్తారు. ఐతే రెండో ఎలిమినేషన్ ఎవరన్నది టఫ్ ఫైట్ నడుస్తుంది. పృధ్వి, అవినాష్, విష్ణు ప్రియ ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అవినాష్ టికెట్ టు ఫినాలె టాస్క్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు.

ఐతే అవినాష్ కు సెకండ్ లీస్ట్ ఓటింగ్ ఉన్నాయని తెలుస్తుండగా.. అతన్ని ఉంచుతారా లేదా ఆ తర్వాత ఎవరు లీస్ట్ ఉన్నారో వారిని ఎలిమినేట్ చేస్తారా.. ఈ విషయంపై కూడా కొద్ది గంటల్లో క్లారిటీ వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఎలిమినేషన్ అన్నది ట్విస్టులు టర్నులతో కొనసాగుతుంది.

Tags:    

Similar News