బిగ్ బాస్ జంట బ్రేక‌ప్?

అయితే మూడు సంవత్సరాల పాటు బలంగా ఉన్న ఈ జంట‌ విడిపోవడమే ఉత్తమమని చివ‌రికి నిర్ణ‌యించుకున్నారు.

Update: 2024-06-26 17:03 GMT

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కరణ్ కుంద్రా - తేజస్వి ప్రకాష్ మూడేళ్ల డేటింగ్ తర్వాత విడిపోయారు. పలు ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ ఛానెల్స్ బ్రేకప్‌ను ధృవీకరించాయి. కొంతకాలంగా ఈ జంట కలిసి లేరని స‌మాచారం. బిగ్ బాస్ సీజన్ 15 (2021)లో ఇద్దరు స్టార్లు ప్రేమ‌లో పడ్డారు. వారి అభిమానులు `తేజ్‌రాన్` అని ఈ జంట‌ను పిలుస్తున్నారు. అయితే మూడు సంవత్సరాల పాటు బలంగా ఉన్న ఈ జంట‌ విడిపోవడమే ఉత్తమమని చివ‌రికి నిర్ణ‌యించుకున్నారు.

తేజస్వి ప్రకాష్ - కరణ్ కుంద్రా ఇకపై డేటింగ్ చేయడం లేదు. వారు విడిపోయి ఇప్ప‌టికే నెల పైగానే అయింది. విడిపోవడానికి కారణం తెలియదు కానీ...గత కొంతకాలంగా ఒకరితో ఒకరు చిన్నపాటి గొడవలతో స‌త‌మ‌త‌మ‌య్యార‌ని తెలిసింది. అయితే ఈ జంట తాము కలిసే ఉన్నామని.. ఒక‌రితో ఒకరు బహిరంగంగా కనిపిస్తారని అభిమానులకు చెబుతారు... గత మూడు సంవత్సరాలుగా ప‌వ‌ర్ క‌పుల్‌గా ఉన్నందున ఈ హృదయ విదారక వార్తను ఇంత హఠాత్తుగా అంగీకరించడం అభిమానులకు అంత సులభం కాదు! అని విశ్లేషిస్తున్నారు. ఈ జంట విడిపోయామ‌ని ఇప్ప‌ట్లో ప్ర‌క‌టించ‌లేరు.. అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Read more!

ఈ బ్రేకప్ పుకార్లపై ప్ర‌శ్నించేందుకు బాలీవుడ్ మీడియా ప్ర‌య‌త్నించ‌గా.. వారు ఈ పుకార్ల‌ను ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. ప్రస్తుతానికి వారు నిజంగా విడిపోయారా లేదా అనేది అనిశ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ ఇద్ద‌రూ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఒకరినొకరు అనుసరిస్తున్నారు. బ్రేక‌ప్ కి సంబంధించిన సామాజిక మాధ్య‌మాల్లో ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.

కరణ్ కుంద్రా -తేజస్వి ప్రకాష్ బిగ్ బాస్ 15 హౌస్‌లో ఒకరినొకరు కలుసుకున్న తర్వాత వారి ప్రేమ కథ ప్రారంభమైంది. వారు ఒకరిపై ఒకరు త‌మ ప్రేమ‌ భావాలను పెంచుకోవడం ప్రారంభించారు. నిండా ప్రేమలో మునిగారు. ఆ సీజన్‌లో తేజస్వి విజేతగా టైటిల్‌ను గెలుచుకుంది. ఈ జంట బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లాక కూడా వారి సంబంధాన్ని కొనసాగించారు. తరచుగా ఈవెంట్‌లు, పార్టీలను కలిసి ఆనందించారు. సోషల్ మీడియాలో ఒకరికొకరు ఫోటోలు కూడా పంచుకునేవారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు సీరియస్‌గా ఉన్నారు. దుబాయ్‌లో ఇల్లు కూడా కొన్నారు.

ఇటీవలి ఇంటర్వ్యూలో కరణ్ కుంద్రా ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందని, తాము ప్రేమ‌లో బలంగా ఉన్నామ‌ని వెల్లడించారు. ``నిజాయితీగా చెప్పాలంటే నేను ఒత్తిడిని తీసుకోవడం ప్రారంభిస్తే అధిగమించలేను. నేను ఒక కళాకారుడిని.. నా జీవితంలో కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవలసిన వ్యక్తిని. నేను ఒత్తిడి కంటే చాలా ఇతర విషయాల గురించి ఆందోళన చెందాలి. కానీ నేను ఈ ఒత్తిడిని తీసుకుంటే నా జీవితాన్ని గడపలేను. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకునేంత తెలివి నాకు ఉంది. మా మ‌ధ్య అనుబంధం కూడా మారలేదు. మేము చాలా సంతోషంగా ఉన్నాము`` అని వివ‌రణ ఇచ్చారు.

Tags:    

Similar News