రెడ్ బికినీలో తేజస్వి.. సెగలు పుట్టిస్తున్న స్టిల్స్

ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి.

Update: 2024-10-25 17:30 GMT

టాలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న తేజస్వి మదివాడ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇన్ స్టాల్ గ్రామ్ లో ఆమె సొగసులు.. ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఫ్యాన్స్‌ను మరింత దగ్గర చేసాయి. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి.


తాజాగా తేజస్వి రెడ్ కలర్ బికినీలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ‘AS IT IS!’ అంటూ క్యాప్షన్ పెట్టిన ఆ ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఆ డీప్ రెడ్ టోన్ లుక్‌తో తేజస్వి స్టన్నింగ్‌గా కనిపిస్తోంది. కూల్ సన్‌గ్లాసెస్, క్లీన్ అండ్ క్లాసీ లుక్‌తో స్మార్ట్‌గా పోజులిస్తూ అందరినీ అట్రాక్ట్ చేసింది. ఈ ఫోటోల్లోని గ్లామర్ దెబ్బకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రైవేట్ పూల్ సైడ్‌లో ఈ ఫోటో షూట్ చేసినట్టుగా కనిపిస్తోంది.


అంతకు ముందు కూడా తన ఫిట్‌నెస్, స్టైలిష్ డ్రెస్సింగ్ సెన్స్‌తో తేజస్వి తరచూ సోషల్ మీడియా ఫాలోవర్లను అలరిస్తుంది. గ్లామర్ ఫోటో షూట్స్‌ తో తన అందాన్ని హైలైట్ చేస్తూ ఉండటం ఆమెకి కొత్తేమి కాదు. ఈసారి తేజస్వి చేసిన ఫోటో షూట్ గతంలో ఎన్నడూ లేనంత హాట్ టాపిక్ అయింది. ఫ్యాన్స్ కామెంట్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.


కెరీర్‌లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తేజస్వి.. ఇదే విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదిస్తోంది. ప్రస్తుతం తేజస్వి కొన్ని చిన్న సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె లుక్స్ మాత్రం పెద్ద హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఇక అమ్మడు త్వరలోనే మంచి బ్రేక్ అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే, ఆమె గ్లామర్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. మరి ఈ గ్లామర్ లుక్స్ ద్వారా అమ్మడికి ఇంకా ఏమైనా అవకాశాలు పెరుగుతాయా లేదో చూడాలి.

Tags:    

Similar News