తెలుగు ఆడియెన్స్ vs తమిళ ఆడియెన్స్: ఎవరు గొప్పంటే?
తాజాగా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద తెలుగు, తమిళ సినిమాల వసూళ్లను గమనిస్తే, తెలుగు ఆడియెన్స్ సినిమాను భాషను పక్కన పెట్టి కేవలం కంటెంట్ ఆధారంగా చూస్తారనే విషయం మరోసారి నిరూపితమైంది.
సినిమా అనేది కేవలం భాషకే పరిమితం కాదు, కంటెంట్ బలంగా ఉంటే అది అన్ని భాషల్లో విజయాన్ని అందుకుంటుంది. తాజాగా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద తెలుగు, తమిళ సినిమాల వసూళ్లను గమనిస్తే, తెలుగు ఆడియెన్స్ సినిమాను భాషను పక్కన పెట్టి కేవలం కంటెంట్ ఆధారంగా చూస్తారనే విషయం మరోసారి నిరూపితమైంది.
తాజా విడుదలైన కల్కి 2898 AD, పుష్ప 2, సలార్, దేవర, గేమ్ చేంజర్ సినిమాల వసూళ్లను గమనిస్తే ఈ స్పష్టత మరింత బలంగా తెలుస్తోంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు భారీ వసూళ్లు సాధించినప్పటికీ, తమిళ వెర్షన్ వసూళ్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కల్కి 2898 AD సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద $18,574,051 వసూలు చేయగా, తమిళ వెర్షన్ కేవలం $551,729 (2.97%) వసూలు చేసింది.
ఇదే విధంగా, పుష్ప 2 $15,266,076 వసూలు చేయగా, తమిళ వెర్షన్ కేవలం $189,901 (1.24%) మాత్రమే సాధించింది. ప్రభాస్ నటించిన సలార్ $8,939,974 గ్రాస్ సాధించినప్పటికీ, తమిళ వెర్షన్ ద్వారా కేవలం $110,951 (1.24%) మాత్రమే వచ్చింది. వీటితో పోలిస్తే, తెలుగు ఆడియెన్స్ మాత్రం కేవలం భాషకే పరిమితం కాకుండా కంటెంట్ బాగుంటే థియేటర్‌కి వెళ్లి చూస్తారు.
ఇక రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ - నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం ( జాబిలమ్మ నీకు అంత కోపమా) సినిమాల విషయంలోనూ స్పష్టమైంది. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ సినిమా నార్త్ అమెరికాలో $6,15,288 వసూలు చేయగా, అందులో తెలుగు వెర్షన్ $1,99,910 గ్రాస్ సాధించింది. ఇది మొత్తం వసూళ్లలో 32.5% షేర్.
అలాగే, ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం సినిమా $1,27,918 వసూలు చేయగా, తెలుగు వెర్షన్ $46,168 వసూలు చేసింది. ఇది మొత్తం వసూళ్లలో 36% షేర్ అని చెప్పుకోవాలి. తమిళ ఆడియెన్స్ ఎక్కువగా తమ భాషా సినిమాలను మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కంటెంట్ బాగుండి ఇతర భాషలో వచ్చినా, పెద్దగా ఆదరించరని స్పష్టమవుతోంది.
కానీ తెలుగు ఆడియెన్స్ మాత్రం సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా థియేటర్‌కి వెళతారు. మొత్తం చూస్తే, తెలుగు ఆడియెన్స్ కేవలం భాష కంటే కంటెంట్ బలాన్ని చూడటం, సినిమా ఎంటర్‌టైన్ చేస్తుందా లేదా అనేది మాత్రమే ఆలోచించడం వల్లనే ఈ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద తెలుగు ఆడియెన్స్ మద్దతు మరింత బలంగా కనిపిస్తోంది.