బిగ్ బాస్ 8 : గ్రాఫ్ తగ్గినా వెనక్కి తగ్గని కంటెస్టెంట్.. టాప్ 3 ఫిక్స్..!

ఐతే ఈ సీజన్ లో నిఖిల్, గౌతం లు టాప్ 2 గా ఫిక్స్ అవ్వగా టాప్ 3 పొజిషన్ లో ప్రేరణ ఉన్నట్టు తెలుస్తుంది.

Update: 2024-12-11 03:45 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో సీజన్ మొదటి నుంచి చివరి దాకా చూస్తే ప్రతి వారం పడుతూ లేస్తూ హౌస్ మెట్స్ తో ఫైట్ చేస్తూ కలిసిపోతూ ఇలా అన్ని విధాలుగా సీరియల్ యాక్టర్ ప్రేరణ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసిందని చెప్పొచ్చు. మొదటి ఐదు వారాలు ఆటలో అదరగొడుతూ వచ్చిన ప్రేరణ ఆ తర్వాత మధ్యలో కాస్త డల్ అయినట్టు అనిపించింది. ముఖ్యంగా కిచెన్ డిపార్ట్ మెంట్ లో ఉంటూ దోశల దగ్గర కర్రీల దగ్గర హౌస్ మెట్స్ తో పోట్లాడేది.

దాని వల్ల ప్రేరణకు ఎక్కువ నామినేషన్స్ కూడా పడ్డాయి. కానీ టాస్కుల విషయానికి వస్తే ప్రేరణ ఫుల్ ఫైట్ చేసింది. దాని వల్లే ఆమె ఈ సీజన్ లో ఒక్కగానొక్క లేడీ ఫైనలిస్ట్ అయ్యింది. ఈ సీజన్ లో టాప్ 5 ఎవరెవరు అవుతారా అన్నది కూడా లాస్ట్ సండే ఎలిమినేషన్ వరకు సస్పెన్స్ నడిచింది. ఐతే ఇప్పుడున్న టాప్ 5 కచ్చితంగా అర్హులు అనిపించేలా చేశారు ఆడియన్స్.

ముఖ్యంగా ప్రేరణ ఆడపులిలా టాస్కులు ఆడుతూ అందరినీ మెప్పిస్తూ వచ్చింది. ఇక ప్రస్తుతం హౌస్ లో ఈ వారం మొత్తం ఎంటర్టైన్మెంటే ఉండగా.. మంగళవారం ఎపిసోడ్ లో సీరియల్ యాక్టర్ కావ్య రాగా ఆమె కోసం చంద్రముఖిలో గంగగా చేసి అదరగొట్టింది ప్రేరణ. అవినాష్ తో కలిసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఐతే ఈ సీజన్ లో నిఖిల్, గౌతం లు టాప్ 2 గా ఫిక్స్ అవ్వగా టాప్ 3 పొజిషన్ లో ప్రేరణ ఉన్నట్టు తెలుస్తుంది.

చివరి రెండు ప్లేస్ లలో అవినాష్, నబీల్ ఉన్నారు. ఐతే ప్రేరణ ఇంకాస్త ట్రై చేస్తే కచ్చితంగా టాప్ 2 కి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రేరణ ది బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈరోజు నుంచి బిగ్ బాస్ హౌస్ లో టాప్ 4 కంటెస్టెంట్స్ ఏవీలు ప్లే చేస్తారని తెలుస్తుంది. ఏవీల తర్వాత బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్స్ తో పార్టీ ఆ తర్వాత ఫైనల్ ఎపిసోడ్ జరుగుతుంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ ఉండబోతుంది.

Tags:    

Similar News