ఆ హీరో.. సినిమా కోసం అన్నీ తానై వ్యవహరించారా?
సినీ హీరోల్లో చాలా మందికి కేవలం నటనపైనే కాదు.. సినిమాకు సంబంధించిన మిగతా విషయాల్లో కూడా పట్టు ఉంటుంది.;

సినీ హీరోల్లో చాలా మందికి కేవలం నటనపైనే కాదు.. సినిమాకు సంబంధించిన మిగతా విషయాల్లో కూడా పట్టు ఉంటుంది. కథానాయకులే అయినా.. వివిధ విభాగాల్లో వారికి ప్రావీణ్యం ఉంటుంది. కాబట్టి కొందరు హీరోలు.. తమ మూవీల్లో నటిస్తూనే డైరెక్షన్, డిస్ట్రిబ్యూషన్ పై ఓ కన్నేసి ఉంచుతారు. అవసరమైతే వాటిలో తలదూర్చుతారు కూడా.
అదే సమయంలో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలు.. తమ అప్ కమింగ్ సినిమాల విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మూవీకి సంబంధించిన ప్రతి మ్యాటర్ ను పర్యవేక్షిస్తుంటారు. వాటిని జాగ్రత్తగా డీల్ చేస్తారు. కచ్చితంగా సక్సెస్ సాధించాలనే టార్గెట్ తో కొత్త మూవీ విషయంలో ముందుకువెళ్తారు.
ఇప్పుడు ఓ తెలుగు హీరో అలానే చేస్తున్నారని తెలుస్తోంది. కొంతకాలం క్రితం ఓ డెబ్యూ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నారు ఆ కథానాయకుడు. అంతే కాదు తన నటనతో మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టారు. ఆ తర్వాత వివిధ సినిమాల్లో నటించారు. కానీ ఆడియన్స్ ను మెప్పించలేకపోయారు.
ఇప్పుడు కొత్త మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమాకు గాను ఇప్పటికే ఒకే ఒక్క చిత్రం తీసిన డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ డైరెక్టర్ ది డెబ్యూ మూవీ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే ఆయన ఓ సినిమా తీశారు. మంచి బజ్ తో థియేటర్లలో రిలీజ్ అయిన ఆ మూవీ.. ఫ్లాప్ గా మారింది.
ఇప్పుడు లాంగ్ బ్రేక్ తీసుకుని సదరు హీరోతో సినిమా తెరకెక్కించారు. అందుకు గాను మంచి క్రేజ్ ఉన్న సీనియర్ యాక్ట్రెస్ ను రంగంలోకి దించారు. అయితే సినిమా డైరెక్షన్ విషయంలో హీరో జోక్యం ఎక్కువగానే చేసుకున్నారని తెలుస్తోంది. మూవీ మంచి విజయం సాధించాలనే లక్ష్యంతో దర్శకత్వ విభాగంలో తల దూర్చారట.
అంతే కాదు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. అదే సమయంలో నిర్మాతగా మంచి అనుభవం ఉన్న ఆ హీరో.. డిస్ట్రిబ్యూషన్ విషయంలో తన మార్క్ చూపించారని సమాచారం. ఎవరికి ఏ హక్కులు అప్పగించాలనేది సుదీర్ఘంగా ఆలోచించి ముందుకెళ్లారట. మొత్తానికి సినిమా కోసం అన్నీ తానై వ్యవహరించిన ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.