మన హీరోల 100 కోట్ల షేర్ సినిమాలు.. ఎవరెవరున్నారంటే..

ఈ ఫీట్ సాధించడంతో హీరోలు వారి స్టార్‌డమ్‌ను మరో మెట్టుపైనకు తీసుకువెళ్తున్నారు.

Update: 2025-01-20 13:53 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 100 కోట్లు షేర్ మార్క్‌ను అందుకోవడం ఇప్పుడు ప్రతీ హీరోకు కామన్ టార్గెట్ గా మారింది. ఈ ఫీట్ సాధించడంతో హీరోలు వారి స్టార్‌డమ్‌ను మరో మెట్టుపైనకు తీసుకువెళ్తున్నారు. ఈ లిస్ట్‌లోకి తాజాగా చేరిన సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్, పుష్ప 2 సినిమాలు టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్‌ను మరింత చాటాయి.

పుష్ప 2: ది రూల్ అల్లు అర్జున్ కెరీర్‌లో మరో ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం జెట్ స్పీడ్ లోనే 100 కోట్ల షేర్ క్లబ్‌లోకి దూసుకెళ్లి, పాన్ ఇండియా మార్కెట్‌లో తన స్థాయిని మరింత పెంచుకుంది. అల్లు అర్జున్ ఇప్పటివరకు మూడు సినిమాలతో ఈ క్లబ్‌లో ఉన్నారు. ఇక అల వైకుంఠపురములో, పుష్ప 1, పుష్ప 2. ఈ ఘనతతో అతను టాలీవుడ్‌లో ప్రాముఖ్యతను మరింత పెంచుకున్నారు.

మరోవైపు, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరి, ఆయన కెరీర్‌లో మరొక ఘనతగా నిలిచింది. రంగస్థలం, RRR వంటి చిత్రాలతో ఇప్పటికే ఈ క్లబ్‌లో ఉన్న రామ్ చరణ్, ఈ సినిమాతో తన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకున్నారు. అయితే, ఈ చిత్రం మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకోలేకపోయినా, ఈ సినిమా ఓపెనింగ్స్ తో మాత్రం హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇతర హీరోల విషయానికి వస్తే, ప్రభాస్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆరు సినిమాలతో ఈ క్లబ్‌లో ఉన్నారు: బాహుబలి 1, బాహుబలి 2, సలార్, కల్కి 2898AD, సాహో, ఆదిపురుష్. మహేష్ బాబు ఐదు హిట్లతో ఈ క్లబ్‌లో ఉన్నారు. ఇక భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నికెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం. చిరంజీవి మూడు హిట్లతో, ఎన్టీఆర్ రెండు హిట్లతో ఈ క్లబ్‌లో నిలిచారు.

ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం కుటుంబ ప్రేక్షకులను మెప్పిస్తూ 100 కోట్ల క్లబ్‌లో చేరిన మరో చిత్రం. ఇది వెంకటేష్ కెరీర్‌లో మొదటి 100 కోట్ల షేర్ సాధించిన చిత్రం కావడం విశేషం. ఈ సినిమా వెంకీ మామా స్టార్డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

100 కోట్లు షేర్ సాధించిన తెలుగు హీరోల లిస్ట్:

1. ప్రభాస్ - 6 - బాహుబలి 1, బాహుబలి 2, సలార్, కల్కి 2898AD, సాహో, ఆదిపురుష్

2. మహేష్ బాబు - 5 - భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నికెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం

3. అల్లు అర్జున్ - 3 - అల వైకుంఠపురములో, పుష్ప 1, పుష్ప 2

4. చిరంజీవి - 3 - ఖైదీ నెంబర్ 150, సైరా, వాల్తేరు వీరయ్య

5. రామ్ చరణ్ - 3 - రంగస్థలం, RRR, గేమ్ ఛేంజర్

6. ఎన్టీఆర్ - 2 - RRR, దేవర

7. వెంకటేష్ - 1 - సంక్రాంతికి వస్తున్నాం

8. తేజ సజ్జా - 1 - హనుమాన్

Tags:    

Similar News