ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఒకటే రూట్ ఎంచుకున్నారుగా..?

ఎన్టీఆర్ కోసం నెల్సన్, అల్లు అర్జున్ కోసం అట్లీ ఈ ఇద్దరు కూడా తమ కెరీర్ బెస్ట్ సినిమాగా ఈ మూవీ నిలిచేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు.;

Update: 2025-03-10 21:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడం వల్ల వెళ్లతో సినిమా చేయాలని మిగతా డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తెలుగు హీరోల పాన్ ఇండియా క్రేజ్ చూసి సినిమాలు సెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు తెలుగు స్టార్స్ తమ నెక్స్ట్ సినిమాలు తమిళ దర్శకులతో సెట్ చేసుకున్నారు. ఆ డైరెక్టర్స్ తో సినిమా చేయడం ఆ స్టార్ ఫ్యాన్స్ కి కూడా సూపర్ జోష్ ఇస్తుంది. ఇంతకీ తమిళ డైరెక్టర్స్ తో చేస్తున్న తెలుగు స్టార్స్ ఎవరన్నది చూస్తే అది ఒకరు ఎన్టీఆర్ మరొకరు అల్లు అర్జున్ అని తెలుస్తుంది.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ రేంజ్ లో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ అట్లీ కాంబో కొన్నాళ్లుగా చర్చల్లో ఉంది. ఐతే పుష్ప 2 తో అల్లు అర్జున్ నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకోగా ఇదే కరెక్ట్ టైం అనుకుని వీరి కలయికలో సినిమా చేస్తున్నారు.

ఇక మరోపక్క ఎన్టీఆర్ కూడా వార్ 2 ని పూర్తి చేసి ఈమధ్యనే ప్రశాంత్ నీల్ సినిమాను మొదలు పెట్టాడు. డ్రాగన్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఐతే డ్రాగన్ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు తారక్. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ సితార బ్యానర్ లో ఈ సినిమా రాబోతుందని కాంబో సినిమా పక్కా అనేస్తున్నారు. ఐతే ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేశాక నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఎన్టీఆర్ కోసం నెల్సన్, అల్లు అర్జున్ కోసం అట్లీ ఈ ఇద్దరు కూడా తమ కెరీర్ బెస్ట్ సినిమాగా ఈ మూవీ నిలిచేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం రజినీకాంత్ తో జైలర్ 2 చేస్తున్నాడు. ఐతే ఆ సినిమా పూర్తి చేయకముందే ఎన్టీఆర్ తో కథా చర్చలు ఉండేలా చూస్తున్నారట. మరి ఈ కాంబో సినిమాలు ఎలాంటి కథలతో వస్తున్నాయి.. బాక్సాఫీస్ పై ఎలాంటి హంగామా చేస్తాయన్నది చూడాలి. ఐతే ఈ కొత్త కాంబినేషన్స్ పై ఫ్యాన్స్ మాత్రం అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

Tags:    

Similar News