నటనలో పాఠాలు చెబుతానని అలా చేసాడు
నటనలో పాఠాలు చెబుతానని చెప్పి అతడు నాతో శృం*గారం చేయబోయాడని ఆరోపించాడు సహనటుడు టెర్రెన్స్ హోవార్డ్.;

నటనలో పాఠాలు చెబుతానని చెప్పి అతడు నాతో శృం*గారం చేయబోయాడని ఆరోపించాడు సహనటుడు టెర్రెన్స్ హోవార్డ్. నటశిక్షకుడు సీన్ కాంబ్స్ తనతో తప్పుగా ప్రవర్తించాడని హోవార్డ్ ఆరోపించాడు. హస్టిల్ & ఫ్లో , ఐరన్ మ్యాన్ వంటి సినిమాలతో పాపులరైన ప్రఖ్యాత స్టార్ టెర్రెన్స్ హోవార్డ్ .. సంగీత దిగ్గజం సీన్ డిడ్డీ కాంబ్స్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యపరిచింది.
బ్యాడ్ బాయ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడు, నటుడు హోవార్డ్ నటన పాఠాల ముసుగులో తనను మోహంలోకి దించాలని ప్రయత్నించాడని పేర్కొన్నారు. దీనివల్ల అసౌకర్యంగా భావించిన తర్వాత తనను దూరం పెట్టాడని అన్నాడు.
ఒకానొక సమయంలో కాంబ్స్ అనుచితంగా ప్రవర్తించడం కొనసాగించాడని, అతడు మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా తననే చూస్తున్నాడని హోవార్డ్ పేర్కొన్నాడు. చివరికి హోవార్డ్ సహాయకులలో ఒకరు కాంబ్స్ ఉద్దేశాల గురించి హెచ్చరించాడు. నువ్వు మోసానికి గురవుతున్నావని వార్నింగ్ ఇచ్చారు.
నేను ఆ విధంగా వంగక(లొంగక)పోవడం వల్ల చాలా వ్యాపారాలను కోల్పోయాను. నేను రాజీపడను. నేను స్వలింగ సంపర్కుల పాత్రలు పోషించను. నేను ఒక వ్యక్తిని ముద్దు పెట్టుకోను అని తెలిపాను! అని అన్నాడట.