క్యాసినోకు చట్టబద్ధత... సంచలన బిల్లుకు ఆ కేబినెట్ ఆమోదం!

పర్యాటకానికి మరింత ఊతమివ్వడంతోపాటు ఉద్యోగాల కల్పన కోసం అని చెబుతూ థాయ్ లాండ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2025-01-14 02:30 GMT

పర్యాటకానికి మరింత ఊతమివ్వడంతోపాటు ఉద్యోగాల కల్పన కోసం అని చెబుతూ థాయ్ లాండ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... క్యాసినో, గ్యాంబ్లింగ్ కు సంబంధించిన ప్రతిపాదిత బిల్లుకు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లు వివాదాస్పదమైనప్పటికీ.. టూరిజం, జాబ్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్ లాండ్ ప్రభుత్వం వెల్లడించింది.

అవును... కారణం ఏదైనా.. అవసరం మరేదైనా తాజాగా క్యాసినో, గ్యాంబ్లింగ్ కు సంబంధించిన ప్రతిపాదిత బిల్లుకు థాయ్ లాండ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. వాటర్ పార్కులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటి టూరిజం కాంపెక్సుల్లోనూ, థీమ్ పార్కుల్లోనూ క్యాసినోల ఏర్పాట్ల అనుమతికి వీలుంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ తాజా నిర్ణయం వైరల్ గా మారింది.

వాస్తవానికి థాయ్ లాండ్ లో గుర్రపు పందేలకు అనుమతి ఉంది. అయితే.. అవి ప్రభుత్వం నిర్వహించేవి మాత్రమే. అయితే... అక్రమ బెట్టింగ్ మాత్రం దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కొనసాగూతుందని అంటారు. ఈ సమయంలో తాజా నిర్ణయం అక్రమ జూదం సమస్యను పరిష్కరించడంతో పాటు ఆదాయాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన థాయ్ లాండ్ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్... అక్రమ బెట్టింగ్ సమస్యను పరిష్కరించడంతో పాటు ఆదాయాన్ని పెంచడం, దేశంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాలతోనే తాజాగా నిర్ణయం అని పేర్కొన్నారు. ఇక.. తాజా ప్రతిపాదిత బిల్లు ప్రకారం... విదేశీయులకు ఉచిత ప్రవేశం కల్పిస్తుండగా.. థాయ్ పౌరులు మాత్రం రూ.148 డాలర్ల ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదే సమయంలో... 20 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి మాత్రం స్వదేశీయులైనా, విదేశీయులైనా క్యాసినోలకు అనుమతి ఉండదని చెబుతున్నారు.

Tags:    

Similar News