ఫ్యాన్ వార్స్‌పై త‌ళా అజిత్ ఏమ‌న్నారంటే?

దుబాయ్ రేస్ విజయం తర్వాత తాజా ఇంటర్వ్యూలో ఫ్యాన్ వార్స్ గురించి తన అభిప్రాయాలను కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

Update: 2025-01-14 04:28 GMT

త‌న పేరుకు ముందు బిరుదులు అవ‌స‌రం లేద‌ని, అన‌వ‌స‌ర‌మైన ఫ్యాన్ వార్స్ కూడా త‌న‌కు న‌చ్చ‌వ‌ని చెప్పడంలో ప్ర‌థ‌ముడు త‌మిళ స్టార్ హీరో అజిత్ కుమార్. దుబాయ్ రేస్ విజయం తర్వాత తాజా ఇంటర్వ్యూలో ఫ్యాన్ వార్స్ గురించి తన అభిప్రాయాలను కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. అభిమానులు తన గురించి, విజయ్ గురించి జపించడం, ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ... ఫ్యాన్ వార్స్ లో పాల్గొనడం గురించి ఆయన మాట్లాడారు.

సహచరులతో దయగా ఉండాలని, వారి జీవితాలను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా అజిత్ వారికి సలహా ఇచ్చారు. అలా చేసిన‌ప్పుడు అది తనను సంతోషపరుస్తుందని అన్నారు. ఎప్పుడు మీరు మీ జీవితాన్ని గడపబోతున్నారు? మీరు నాకు ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞుడిని. కానీ దయచేసి మీ జీవితాల‌ను జాగ్రత్తగా చూసుకోండి. నా అభిమానులు కూడా తమ జీవితాల్లో చాలా బాగా రాణిస్తున్నారని తెలుసుకున్నప్పుడు నేను సంతోషంగా ఉంటాను. వారు నా తోటివారితో నా సహనటులతో దయగా ఉన్నప్పుడు అంతా మంచి జ‌రుగుతుంద‌ని అన్నారు.

జీవితం చాలా చిన్నది. మన మునిమనవళ్లు మనల్ని గుర్తుంచుకోరు. కాబట్టి ఒక విష‌యం గుర్తుంచుకోండి. ఈ రోజు కోసం జీవించండి. గతాన్ని చూసి ఏం జరిగి ఉంటుందోన‌ని, భవిష్యత్తును చూసి ఏమ‌వుతుందోన‌ని చింతించకండి. ప్రస్తుతంలో జీవించండి. ఎందుకంటే ఏదో ఒక రోజు మనమంతా చనిపోతాము.. అదే నిజం.. అని అజిత్ వేదాంత ధోర‌ణితో మాట్లాడారు. కష్టపడి పని చేద్దాం, సంతోషంగా ఉందాం. శారీరకంగా.. మాన‌సికంగాను ఆరోగ్యంగా ఉండండి అని అన్నారు. అజిత్ కుమార్ తదుపరి చిత్రం విదాముయార్చి ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News