డ్యూయల్ రోల్ లో విజయ్… ఈ సారి క్రేజీగా..

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన లియో మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు

Update: 2023-08-29 04:22 GMT

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన లియో మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ 68వ సినిమా స్టార్ట్ కానుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండటం విశేషం.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. సినిమాలో విజయ్ మరోసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడంట. ఇలా డ్యూయల్ రోల్ లో వచ్చిన మెర్సల్ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ మూవీ కాస్తా స్పెషల్ అనే మాట వినిపిస్తోంది. ఇందులో ఒక పాత్ర విలన్ గా ఉంటుందంట. తండ్రి కొడుకుల మధ్య జరిగే యుద్ధంగానే ఈ కథని వెంకట్ ప్రభు ఆవిష్కరించబోతున్నారంట.

తండ్రి పాత్ర కోసం త్రీడీ ఫేస్ స్కానింగ్ టెక్నాలజీని ఈ చిత్రం కోసం ఉపయోగించబోతున్నారంట. దానికోసం చిత్ర యూనిట్ ఇప్పటికే యూఎస్ వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వారితో సంప్రదింపులు జరుపుతున్నారంట. ఇప్పటికే ఈ టెక్నాలజీని షారుఖ్ ఖాన్ ఫ్యాన్ మూవీకి ఉపయోగించారు. శంకర్ ఇండియన్ 2 చిత్రానికి ఉపయోగిస్తున్నారు.

ఇప్పుడు వెంకట్ ప్రభు కూడా విజయ్ పై ఇలాంటి ప్రయోగమే చేయబోతున్నారంట. తండ్రి, కొడుకుల పాత్రలని పూర్తి భిన్నమైన లుక్స్ తో చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో చేయబోతున్నారంట. మొత్తానికి విజయ్ ని ఫ్యాన్స్ ఈ సారి పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కూడా ఈ చిత్రంలో చూడబోతున్నారని అర్ధమవుతోంది. ఓ విధంగా అభిమానులకి ఇది శుభవార్త అని చెప్పొచ్చు.

కస్టడీ లాంటి డిజాస్టర్ తర్వాత వెంకట్ ప్రభు మళ్ళీ కోలీవుడ్ లోనే విజయ్ లాంటి స్టార్ హీరోకి కథ చెప్పి ఒప్పించి మూవీని స్టార్ట్ చేయబోతుండటం విశేషం AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తోన్న 25వ మూవీ ఇది కావడం విశేషం. ఈ చిత్రంపై నిర్మాతలు 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

Tags:    

Similar News