ముగ్గురు హీరోయిన్స్ ఉంటేనే థమన్ హీరోగా చేస్తాడా..?

శంకర్ డైరెక్షన్ లో సిద్ధార్థ్, జెనిలియా నటించిన బాయ్స్ సినిమాలో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో థమన్ కూడా ఉంటాడు

Update: 2025-03-01 03:45 GMT

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆడియన్స్ కు ముందు యాక్టర్ గా పరిచయమయ్యాడని తెలిసిందే. శంకర్ డైరెక్షన్ లో సిద్ధార్థ్, జెనిలియా నటించిన బాయ్స్ సినిమాలో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో థమన్ కూడా ఉంటాడు. అప్పటికి మ్యూజిక్ అంటేనే ఇష్టం ఉన్నా కూడా శంకర్ చెప్పడం వల్ల ఆ సినిమాలో ఆ పాత్ర చేశాడు థమన్. ఐతే ఆ తర్వాత మళ్లీ థమన్ తెర మీద కనిపించే ప్రయత్నం చేయలేదు. తను కేవలం తెర వెనుక ఉంటూ మంచి మ్యూజిక్ అందిస్తూ సినిమాకు సపోర్ట్ గా ఉంటూ వచ్చాడు.

ఐతే ఆఫ్టర్ లాంగ్ టైం థమన్ మళ్లీ స్క్రీన్ మీద మెరుస్తున్నాడు. తమిళంలో అథర్వ హీరోగా తెరకెక్కుతున్న ఇదయం మురళి సినిమాలో థమన్ ఫ్రెండ్ రోల్ చేస్తున్నాడు. సినిమాకు సంబందించిన ఒక వీడియో ఆమధ్య రిలీజై వైరల్ గా మారింది. ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు ఆన్ స్క్రీన్ కూడా థమన్ అదరగొట్టేశాడని అనిపించింది. ఐతే థమన్ లీడ్ రోల్ లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే డౌట్ రాగా ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో దానికి ఆన్సర్ ఇచ్చాడు థమన్.

ఆది పినిశెట్టి లీడ్ రోల్ లో వచ్చిన శబ్దం సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొన్న థమన్ తను హీరోయిన్ గా చేయాలంటే ఒకరు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్స్ ఉండాలని సరదాగా అన్నాడు. ఆది పినిశెట్టి నటించిన ఒకప్పటి వైశాలి సినిమాకు థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు అదే సినిమా టీం శబ్దం సినిమా చేసింది. ఈ సినిమాకు కూడా థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి థ్రిల్ కలిగించాడు.

ఐతే తనకు తెర మీద కనిపించాలన్న ఆలోచన లేదని ఇదయం మురళి సినిమాలో కూడా అదేదో అలా జరిగి పోయిందని అన్నారు థమన్. ఐతే థమన్ లాంటి యాక్టివ్ పర్సన్ తెర మీద కూడా కనిపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఇదయం మురళి టీజర్ తోనే ఇంప్రెస్ చేయగా ఆ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఆ సినిమాను తెలుగు ఆడియన్స్ ముందుకు కూడా తీసుకొస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News