పుష్ప-2 మ్యూజిక్.. ఎట్టకేలకు తమన్ ఓపెన్..

తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యారు. పుష‍్ప 2 కోసం తాను 10 రోజుల పాటు వర్క్ చేశానని తెలిపారు.;

Update: 2025-04-16 07:54 GMT
Thaman Opens On Pushpa 2 Controversy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప-2 మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో అనేక రికార్డులు బద్దలు కొట్టి.. మరెన్నో క్రియేట్ చేసి ఓ రేంజ్ లో అలరించింది. బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ వసూళ్లను రాబట్టి సరికొత్త చరిత్ర లిఖించింది.

అయితే పుష్ప-2 రిలీజ్ కు ముందు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో జోరుగా చర్చ సాగిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ కాకుండా పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. అందులో తమన్ పేరు ఉంది. ఆయన కూడా ఓ మూవీ ఫంక్షన్ లో పుష్ప-2కి వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక టైటిల్స్ లో ఆయన నేమ్ లేదు.

దీంతో ఏమైందో ఇప్పటి వరకు క్లారిటీ లేకపోగా.. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యారు. పుష‍్ప 2 కోసం తాను 10 రోజుల పాటు వర్క్ చేశానని తెలిపారు. కష్టపడి మూడు వెర్షన్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చానని తెలిపారు. తన వర్క్ టీమ్ కు ముందు నచ్చిందని చెప్పారు. కానీ ఫైనల్ లో డిసెషన్ మార్చారని అన్నారు.

చివరగా దేవి శ్రీ ప్రసాద్, సామ్ సీఎస్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే చేశారని తెలిపారు తమన్. అయినా తనకే నాకేం బాధ లేదని, అందరి ఒప్పందంతో దర్శకుడు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రస్తుతం తమన్ కామెంట్స్ వైరల్ కాగా.. పుష్ప-2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇప్పటికి క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.

అయితే మూడు వెర్షన్లతో తమన్ ట్రై చేసినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల మేకర్స్ తీసుకోలేదు. అక్కడ టాలెంట్ మ్యాటర్ కాదు.. డైరెక్టర్ ఆలోచనకు సరిపోలేదేమో. అదే సమయంలో పుష్ప 2 లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని చెప్పాలి. ఫస్ట్ పార్ట్ టెంపోను కొనసాగించింది. చిత్రానికి మాస్ అప్పీల్ ఇవ్వడంలో సహాయపడింది.

ఇక పుష్ప-2 పాటల విషయానికొస్తే.. ఒక్కొక్కటి ఒక్కో లెవెల్. సినిమాలోని ప్రతీ సాంగ్ కూడా ఆడియన్స్ ను మెప్పించింది. పాటలన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. ఓ రేంజ్ లో రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సినిమా వచ్చి ఐదు నెలలు అవుతున్నా.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉండడం విశేషం.

Tags:    

Similar News