వర్త్ మామా వర్త్: థమన్
ఇప్పుడే సూపర్ మాసివ్ సాంగ్ జరగండి ఫైనల్ కట్ చూసాను. వర్త్ మామా వర్త్అంటూ ట్వీట్ చేసి ఫైర్ ఎమోజీలు యాడ్ చేశాడు.
'పుష్ప 2’తో ఈ ఏడాది టాలీవుడ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. దీని తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జనవరి 10న థియేటర్స్ లోకి రాబోతున్నాడు. వచ్చే ఏడాది 'గేమ్ చేంజర్’ తోనే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల సందడి మొదలు కాబోతోంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.
సుమారు మూడేళ్ళ తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా సంక్రాంతి రేసులో సూపర్ హిట్ గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే సినిమా నుంచి నాలుగు పాటలు రిలీజ్ చేశారు.
ఇక డిసెంబర్ 31న 'గేమ్ చేంజర్’ ట్రైలర్ రాబోతోందని టాక్ వినిపిస్తోంది. మెగా ఈవెంట్ లో ఈ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై పబ్లిక్ కి ఒక అంచనా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ, అంజలి కనిపించబోతున్నారు. ఎస్ జె సూర్య పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా నటించాడు.
సోషల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇప్పుడే సూపర్ మాసివ్ సాంగ్ జరగండి ఫైనల్ కట్ చూసాను. వర్త్ మామా వర్త్అంటూ ట్వీట్ చేసి ఫైర్ ఎమోజీలు యాడ్ చేశాడు. ఈ ట్వీట్ తో సాంగ్ లో శంకర్ విజువలైజేషన్ చూసి థమన్ చాలా ఎగ్జైట్ అయ్యి పోస్ట్ చేశారని అర్ధమవుతోంది.
శంకర్ సినిమాలలో సాంగ్స్ పిక్చరైజేషన్ అంచనాలకి మించి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవ్వరు ఊహించని స్థాయిలో, అద్భుతమైన లొకేషన్స్, సెట్ వర్క్స్ తో శంకర్ తన మూవీస్ లో సాంగ్స్ ని తెరపై అందంగా ఆవిష్కరిస్తారు. 'గేమ్ చేంజర్’ మూవీలో సాంగ్స్ కూడా అలాగే తెరపై విజువల్ వండర్ గా చూపించి ఉంటారని అనుకుంటున్నారు.
రా మచ్చా మచ్చా సాంగ్ పిక్చరైజేషన్ కి సంబంధించి విజువల్స్ తో ఆ సాంగ్ లిరికల్ వీడియోలో చూపించారు. చాలా మంది కళాకారులు, బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్స్ తో ఆ సాంగ్ డిజైన్ చేశారు. అలాగే మిగిలిన సాంగ్స్ కూడా ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.