బ్లాక్ బస్టర్ డేట్ కే.. నితిన్ 'తమ్ముడు'
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మార్చి 28వ తేదీన రాబిన్ హుడ్ మూవీతో సందడి చేయనున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయనే చెప్పాలి.
అదే సమయంలో నితిన్ చేతిలో ఉన్న మరో ప్రాజెక్ట్ తమ్ముడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న మూవీలో వర్ష బొలమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి లయ కీలక పాత్రలో యాక్ట్ చేస్తుండడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
అయితే డైరెక్టర్ శ్రీరామ్ వేణు, దిల్ రాజు కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన MCA, వకీల్ సాబ్ చిత్రాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమ్ముడు ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ సూపర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక సినిమాను మహా శివరాత్రి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట.
సమ్మర్ కానుకగా మే 9వ తేదీన తమ్ముడు మూవీ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చి.. క్రేజీ అప్డేట్ కూడా మేకర్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. మేకర్స్ సూపర్ డేట్ ను ఫిక్స్ చేశారని అంటున్నారు.
ఎందుకంటే ఇప్పటికే టాలీవుడ్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, మహానటి, మహర్షి వంటి ఎన్నో సినిమాలు ఆ రోజు రిలీజ్ అయ్యి సూపర్ హిట్స్ గా నిలిచాయి. రవితేజ మాస్ జాతర కూడా అప్పుడే వస్తుందని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా తప్పుకుందని తెలుస్తోంది. ఏదైనా తమ్ముడు మూవీ సరైన డేట్ కే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.