తమన్ Vs భీమ్స్.. సంక్రాంతికి నెగ్గేదెవరు?

ఇక గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి భీమ్స్ సిసిరోలియో బాణీలను కట్టారు.

Update: 2025-01-02 17:30 GMT

సంక్రాంతి వచ్చేస్తోంది. అందరూ పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో విడుదలయ్యే మూవీలు చూసేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి పొంగల్ బరిలో మూడు తెలుగు స్ట్రయిట్ చిత్రాలు దిగుతున్న విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ రానున్నాయి.

అయితే నార్మల్ గా సినిమాలపై ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అయ్యేందుకు మ్యూజిక్ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అదే సంక్రాంతి చిత్రాల విషయంలో మ్యూజిక్ ఇంపాక్ట్ కాస్త ఎక్కువే ఉంటుంది. దీంతో ఈసారి పొంగల్ మూవీ ఆల్బమ్స్ ఎలాంటి హిట్ అవుతాయోనని అంతా చూస్తున్నారు.

ఇక గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి భీమ్స్ సిసిరోలియో బాణీలను కట్టారు. ఆయన స్వరపరిచిన మూడు పాటలు రిలీజ్ అవ్వగా.. చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మంచి వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

అందులో రమణ గోగుల ఆలపించిన గోదారి గట్టు మీద రామ చిలకవే.. వేరే లెవెల్ లో సందడి చేస్తోంది. మీనూ, బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్స్ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. మరోవైపు, డాకు మహరాజ్ లోని తమన్ స్వరపరిచిన రెండు పాటలు రిలీజ్ అవ్వగా... అవి కూడా ఆకట్టుకున్నాయి. కానీ అఖండ రేంజ్ లో హిట్ అవ్వలేకపోయాయి!

స్లో పాయిజన్ గా ఆడియన్స్ కు ఎక్కుతున్నాయి. త్వరలో మూడో పాట దబిడి దబిడిని డాకు మహారాజ్ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. అదే సమయంలో గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే జరగండి, రా మచ్చా, హైరానా, డోప్ సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. విజువల్స్ తో పాటు స్టార్ హీరో రామ్ చరణ్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కానీ చాలా మంది చరణ్ రేంజ్ కు తగ్గట్టు పాటలు అవి కావని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తమన్, భీమ్స్ లో ఎవరు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు మనం సాంగ్స్ మాత్రమే విన్నాం. ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను విట్నెస్ చేసే టైమ్ ఉంది. కాబట్టి మూవీలు రిలీజ్ అయితే గానీ.. తమన్, భీమ్స్ లో ఎవరు నెగ్గుతారో చెప్పగలం.

Tags:    

Similar News