తండేల్ టార్గెట్ ఫినిష్.. చైతూ బిగ్గెస్ట్ బౌన్స్ బ్యాక్
నాగ చైతన్యకు ఇదివరకూ యూఎస్ మార్కెట్‌లో ఒక స్థిరమైన ఫాలోయింగ్ ఉన్నా, ఇటీవలి సినిమాలతో ఆ మార్కెట్ తగ్గిపోయింది.
నాగ చైతన్య కెరీర్‌లో గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేకపోవడం, వరుసగా ఫ్లాప్‌లతో కాస్త వెనుకబడటం అభిమానులకు నిరాశ కలిగించింది. 'థాంక్ యూ', 'కస్టడీ' సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో చైతూ కెరీర్ గురించి పెద్ద చర్చే నడిచింది. అయితే, ఇప్పుడు ‘తండేల్’ మూవీతో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు. వరుస ఫ్లాప్స్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈసారి, రియల్ స్టోరీతో కూడిన యాక్షన్ డ్రామా కావడంతో అంచనాలు బాగా పెరిగాయి. ఇక బాక్సాఫీస్ వద్ద అనుకున్నట్లే టార్గెట్ ను కూడా తొందరగానే ఫినిష్ చేశాడు.
చందూ మొండేటి తెరకెక్కించిన విధానం, నాగ చైతన్య - సాయి పల్లవి కెమిస్ట్రీ సినిమాకి ప్లస్ అయ్యాయి. సినిమా మొదటి రోజే అద్భుతమైన వసూళ్లు సాధించి, నాగ చైతన్య కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా చాలా బలంగా ఆడుతోంది. నాగ చైతన్యకు ఇదివరకూ యూఎస్ మార్కెట్‌లో ఒక స్థిరమైన ఫాలోయింగ్ ఉన్నా, ఇటీవలి సినిమాలతో ఆ మార్కెట్ తగ్గిపోయింది.
కానీ ‘తండేల్’ ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ, బాక్సాఫీస్ దగ్గర మరోసారి చైతూ క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే 6 రోజులకే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని, ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టింది. వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడమే కాకుండా, అదనంగా లాభాలు కూడా తెచ్చుకుంది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో ఈ సినిమా చాలా బలంగా నిలిచింది. సాయి పల్లవి ‘బుజ్జి తల్లి’ క్యారెక్టర్‌ను అందరూ కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి మరింత బలం ఇచ్చాయి.
ఈ వారం మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే, వాలెంటైన్స్ వీకెండ్. లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా కావడంతో యూత్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వీకెండ్ లో పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, వీకెండ్‌కు ముందు బుకింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. చైతన్య కెరీర్‌లో ఇది ఒక రికార్డు కమ్ బ్యాక్ అని చెప్పవచ్చు.
గతంలో 'మజిలీ' తో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న చైతు ఆ తరువాత లవ్ స్టోరీతో కూడా సాలీడ్ కలెక్షన్స్ రాబట్టాడు. ఇక ఇప్పుడు ‘తండేల్’తో అదే మ్యాజిక్ రిపీట్ చేసింది. ముఖ్యంగా నాగ చైతన్య నెవర్ బిఫోర్ లుక్, హై ఇమోషనల్ కంటెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఈ సినిమా సక్సెస్‌తో నాగ చైతన్య మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడనే చెప్పొచ్చు. తండేల్ బడ్జెట్ పరంగా కూడా నాగచైతన్య కెరీర్ లో చాలా పెద్ద సినిమా. ఇక విడుదలకు ముందే సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా మంచి బిజినెస్ జరిగింది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. దీంతో నిర్మాత సేఫ్ కావడమే కాకుండా లాభాలు అందుకున్నాడు అని చెప్పవచ్చు.