నిర్మాత మాట నిలబెట్టిన తండేల్
తెలుగులో చాలామంది స్టార్లు వంద కోట్ల మైలురాయిని అందుకున్నారు. కొందరు సూపర్ స్టార్లు 500 కోట్లు, 1000 కోట్ల మైల్‌స్టోన్ కూడా టచ్ చేశారు.
తెలుగులో చాలామంది స్టార్లు వంద కోట్ల మైలురాయిని అందుకున్నారు. కొందరు సూపర్ స్టార్లు 500 కోట్లు, 1000 కోట్ల మైల్‌స్టోన్ కూడా టచ్ చేశారు. కానీ టాలీవుడ్లో పెద్ద ఫ్యామిలీస్‌లో ఒకటైన అక్కినేని కుటుంబం నుంచి మాత్రం ఎవ్వరూ ఇప్పటిదాకా వంద కోట్ల వసూళ్ల క్లబ్బులోకి కూడా అడుగుపెట్టలేదు. సీనియర్ అయిన అక్కినేని నాగార్జున.. జూనియర్లైన నాగచైతన్య, అఖిల్ ఇప్పటిదాకా ఈ ఘనత సాధించలేకపోయారు. ఐతే ఎట్టకేలకు అక్కినేని ఫ్యామిలీ ఖాతాలోకి వంద కోట్ల సినిమా వచ్చి చేరింది. చైతూ కొత్త చిత్రం ‘తండేల్’ వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది. విడుదలైన తొమ్మిది రోజులకు ఈ చిత్రం ఈ ఘనత సాధించింది. ‘తండేల్’ వరల్డ్ వైడ్ గ్రాస్ శనివారంతో వంద కోట్ల మైలురాయిని అధిగమించింది.
‘తండేల్’ సినిమా సంక్రాంతికి రాలేదని అభిమానులు ఫీలవుతున్న దశలో నిర్మాత బన్నీ వాసు వంద కోట్ల మైలురాయి గురించి మాట్లాడాడు. తమ చిత్రం ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోందని ప్రకటిస్తూ.. అక్కినేని ఫ్యాన్స్ ఫీలవ్వాల్సిన పని లేదని, ఈ సినిమాను వంద కోట్ల క్లబ్బులో నిలబెట్టాలని చూస్తున్నామని అన్నాడు. ఆయన మాట ఇప్పుడు నిజం అయింది. ‘తండేల్’కు వచ్చిన టాక్, ఓపెనింగ్స్ చూస్తేనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టబోతోందని అర్థమైంది. తొలి వీకెండ్లోనే ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వీక్ డేస్‌లో సినిమా కొంచెం వీక్ అయినా.. రెండో వీకెండ్ సమయానికి పుంజుకుంది. ఈ వారం వచ్చిన లైలా, బ్రహ్మ ఆనందం’ పెద్దగా ప్రభావం చూపకపోవడం దీనికి కలిసొచ్చింది. సెకండ్ వీకెండ్లో కూడా కలెక్షన్లు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. శనివారం ఆక్యుపెన్సీలు బాగున్నాయి. ఆదివారం కూడా సినిమా జోరు కొనసాగిస్తోంది. గీతా ఆర్ట్స్ బేనర్ మీద నిర్మించిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి రూపొందించాడు. ఇది వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.