తండేల్ లుక్: రెంచీతో రిపేర్లు ఇంకేం చేస్తాడు!
నాగచైతన్య- సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ ఎమోషనల్ లవ్ స్టోరిని ఎలివేట్ చేస్తుందని తొలి నుంచి మేకర్స్ చెబుతున్నారు.
అందమైన అమ్మాయి కళ్ల ముందే నాట్యమాడుతోంది. అలా లయబద్ధంగా నాజూకు నడుము సొగసును పరిచేస్తూ కవ్వించేస్తోంది. అలాంటి సన్నివేశంలో పాడైన మరబోటును బాగు చేయడానికి మనసు ఎలా ఒప్పుతుంది? ఆ కుర్రాడి చేతిలో రెంచీ కదులుతుందా? ... ఇదిగో ఇక్కడ `తండేల్` బీచ్ సన్నివేశం చూస్తుంటే విషయం అర్థమైపోతోంది.
నాగచైతన్య- సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ ఎమోషనల్ లవ్ స్టోరిని ఎలివేట్ చేస్తుందని తొలి నుంచి మేకర్స్ చెబుతున్నారు. దానికి తగ్గట్టే ఈ జంట నడుమ రొమాన్స్ మరో లెవల్ లో వర్కవుట్ చేసారని ఈ కొత్త స్టిల్ చెప్పకనే చెబుతోంది. నాగచైతన్య మత్స్యకారుడిగా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతడికి జతగా అందమైన అమ్మాయి (సాయిపల్లవి) బాగానే కుదిరింది. ఆ ఇద్దరి నడుమా రొమాన్స్ వేరే లెవల్ లో వర్కవుట్ చేస్తున్నారు దర్శఖుడు చందు మొండేటి.
శ్రీకాకుళం మత్స్యకారుడు పాక్ సముద్ర జలాల్లో చిక్కుకుని, అరెస్టయ్యాక ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. ఎమోషనల్ డ్రామాలో ప్రేమకథ ఎలా వర్కవుటైందో చూడాలన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెండు సింగిల్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. మేకర్స్ మూడవ సింగిల్ హైలెస్సా హైలెస్సాను జనవరి 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ఈ మెలోడీని ప్రత్యేకంగా తీర్చిదిద్దారని సమాచారం. బన్నీ వాసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 7 న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.