100 కోట్ల క్లబ్.. వారికి నాగచైతన్య గ్రాండ్ పార్టీ
ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు మూవీ టీమ్ ఘనంగా సక్సెస్ పార్టీని నిర్వహించింది. ఫిల్మ్‌నగర్‌లోని పబ్‌లో ఆదివారం రాత్రి ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది.
‘తండేల్’ సినిమాతో నాగ చైతన్య తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డుని సాధించాడు. ఈ చిత్రం అక్కినేని హీరోలలో ఎవరూ సాధించలేని ఘనతను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన తండేల్ తాజాగా 100 కోట్ల గ్రాస్‌ను దాటేసింది. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు మూవీ టీమ్ ఘనంగా సక్సెస్ పార్టీని నిర్వహించింది. ఫిల్మ్‌నగర్‌లోని పబ్‌లో ఆదివారం రాత్రి ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది.
పార్టీకి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాతలు స్వప్న, నాగవంశీ, అల్లు అరవింద్, బన్నీ వాస్, సుప్రియ, బాపినీడు, దర్శకులు చందు మొండేటి, కార్తీక్ దండు వంటి సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌కు చెందిన సన్నిహితులు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ పార్టీకి హాజరై నాగ చైతన్యను ప్రత్యేకంగా అభినందించారు.
నాగ చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తండేల్, ఆయనకు ప్యాన్ ఇండియా క్రేజ్ కూడా తీసుకు వచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో, బన్నీ వాస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ కథ, నాగ చైతన్య సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. ఈ అన్ని అంశాలు సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.
తండేల్ మొదట 95 కోట్ల గ్రాస్ వసూలు చేసిన అనంతరం కాస్త స్లో అయినట్లు అనిపించింది. కానీ ఆ తరువాత కూడా అదే జోరు కొనసాగుతూ 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కేవలం నాగ చైతన్య కెరీర్‌లోనే కాదు, మొత్తం అక్కినేని ఫ్యామిలీ హీరోల్లో ఎవరికీ సాధించని రికార్డు. ఈ రికార్డు సాధించడం చైతన్య ఫ్యాన్స్‌కు పెద్ద సంబరంగా మారింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్‌గా రన్ అవుతుండటంతో మరో రికార్డ్ కూడా అందుకోవడం కష్టమేమీ కాదు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ సినిమాతో నాగచైతన్య తదుపరి సినిమాల రేంజ్ కూడా రన్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విజయంతో నాగ చైతన్య తన స్థాయిని మరింత పెంచుకున్నాడనే చెప్పాలి. మొత్తానికి తండేల్ 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, నాగ చైతన్యకు ఈ ఘనత చేకూరడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. చైతు తదుపరి సినిమాలపై కూడా మరింత ఆసక్తి పెరిగింది. నెక్స్ట్ నాగచైతన్య కార్తిక్ దండు సినిమాతో రాబోతున్నాడు.