విక్రమ్ సినిమా.. చివరి నిమిషంలో ఓటీటీ ట్విస్ట్

తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం తంగలాన్.

Update: 2024-10-07 18:45 GMT

తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం తంగలాన్. ఈ చిత్రం పా రంజిత్ దర్శకత్వంలో, ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా, విడుదల సమయంలో ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

తంగలాన్ కథాంశం, బ్రిటీష్ కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ ప్రాంతంలోని బంగారు గనుల చుట్టూ తిరుగుతుంది. ఈ గనులు అక్కడి గిరిజనుల జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి, వారి ఆర్థిక పరిస్థితులు, సామాజిక సమస్యలు ఎలా మారాయి అనే విషయాలను దర్శకుడు పా రంజిత్ కళ్ళకు కట్టినట్టు తెరపై చూపించారు. సినిమాలోని విజువల్స్, ఎమోషన్స్ ప్రేక్షకులను కొంత మేరకు కదిలించాయి.

విశేషం ఏమిటంటే, తంగలాన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ముందుగానే కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ప్రకటించినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాని పరిస్థితి ఏర్పడింది. లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ మరియు తంగలాన్ మేకర్స్ మధ్య కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా తంగలాన్ డిజిటల్ హక్కుల ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేయనున్నట్లు టాక్.

టీజర్ లాంచ్ నుంచే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై విడుదల తర్వాత వచ్చిన ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, వారం రోజుల తర్వాత స్ట్రీమింగ్ హక్కుల విషయంలో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. సినిమా విడుదల తరువాత పెద్దగా సక్సెస్ కాకపోతే ముందుగా నిర్ణయించిన డిజిటల్ రైట్స్ రేట్లను ఓటీటీ సంస్థలు తగ్గించడం ఇప్పుడు ఓ సర్వసాధారణ విషయమైపోయింది. బహుశా తంగలాన్ విషయంలో కూడా ఇదే జరగిందనే టాక్ వినిపిస్తోంది.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, తంగలాన్ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందట. త్వరలోనే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్ నుండి అమెజాన్ ప్రైమ్ కు డిజిటల్ రైట్స్ మారడం ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురావడం వల్ల మేకర్స్ కు కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సినిమా బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ లో తంగలాన్ కి మంచి రెస్పాన్స్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News