'తస్సాదియ్యా' భలే సాంగ్ వదిలారే!
కెరీర్ ఆరంభం నుంచీ తనదైన రీతిలో సత్తా చాటుతోన్న అతడు.. వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు.
సినీ రంగంలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం వేరేగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే. అందులోనూ కొందరు ప్రత్యేకమైన స్టార్‌డమ్‌తో అలరిస్తున్నారు. అలాంటి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ తనదైన రీతిలో సత్తా చాటుతోన్న అతడు.. వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు.
చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు నటిస్తోన్న సినిమానే ‘మట్కా’. పలాస వంటి క్రేజీ సినిమాను రూపొందించిన కరుణ కుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనికితోడు ఈ సినిమా నుంచి ప్రచార చిత్రాలు, పోస్టర్లు విభిన్నంగా ఉండడంతో ఇది హైప్‌ను క్రమంగా పెంచుకుంటోంది. అలా అలా ఆడియెన్స్ ఫోకస్‌కు కూడా లాక్కుంటూ వెళ్తోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ‘మట్కా’ మూవీ నవంబర్ 14న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌తో పాటు ‘లే లే రాజా’ అంటూ సాగే పాట విడుదల అయ్యాయి. ఇవి సినిమా హ్యూజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ మేకర్స్ సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందుతోన్న ‘మట్కా’ చిత్రం నుంచి తాజాగా ‘తస్సాదియ్యా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను భాస్కరభట్ట రచించారు. మనో ఈ పాటను అదిరిపోయే గాత్రంతో ఆలపించారు. 1990 బ్యాగ్‌డ్రాప్ క్లబ్ సాంగ్ మాదిరిగా ఇది ఉంది. ముఖ్యంగా రెట్రో థీమ్‌తో ఇప్పటి శ్రోతలకు చాలా కొత్త అనుభూతిని అందించేలా దీన్ని కంపోజ్ చేశారు.
‘మట్కా’ చిత్రంలోని ‘తస్సాదియ్యా’ పాట రెట్రో థీమ్‌తో ఉన్నప్పటికీ ఇప్పటి యూత్‌ను కూడా ఆకట్టుకునేలా దీన్ని చిత్రీకరించారు. ముఖ్యంగా ఇందులో లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి. అలాగే, వరుణ్ తేజ్ లుక్ కూడా చాలా కొత్తగా అనిపిస్తోంది. మొత్తంగా ఈ సాంగ్ అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకునేలా ఉందని చెప్పొచ్చు.
ఇక, కరుణ కుమార్ - వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘మట్కా’ సినిమాను వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.