సలార్ ఒప్పుకోవడానికి కారణం అదే..
అంతేకాకుండా మొదటి రోజు రూ.178 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది.
KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకున్న ప్రభాస్ కి 'సలార్' భారీ కం బ్యాక్ ఇచ్చింది. అంతేకాకుండా మొదటి రోజు రూ.178 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది.
ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న సలార్ మూవీ గురించి తాజాగా ఓ హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్ సలార్ సినిమాని ఒప్పుకోవడానికి గల కారణాన్ని బయటపెట్టారు. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.." సలార్ కథ నాకెంతో నచ్చింది. స్టోరీ విన్న వెంటనే ఓకే చెప్పాను. నా కెరీర్ లో చేసిన డిఫరెంట్ రోల్స్ లో ఇది కూడా ఒకటి. ఈ క్యారెక్టర్ చేయడం ఎంతో సవాల్ తో కూడుకుంది. బాహుబలి 2 నా కెరీర్ కి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది.
ఆ తర్వాత ఎంచుకున్న సినిమాలన్నీ కొత్తదనం ఉండేలా చూసుకున్నాను. అందులో భాగంగానే సలార్ సినిమాకి ఓకే చెప్పాను. అలాగే ప్రేక్షకులు కూడా వైవిధ్యమైన కంటెంట్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఇండియన్ సినిమాల గురించే చర్చించుకుంటోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని గుర్తిస్తున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పని చేయడం అద్భుతమైన అనుభూతినిచ్చింది.
సలార్ పార్ట్-1 చివర్లోనే రెండో భాగం ఉంటుంది. మొదటి పార్ట్ తో పోలిస్తే రెండో పార్ట్ మరింత అద్భుతంగా ఉంటుంది" అని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా సలార్ పార్ట్-1 చూసిన ఆడియన్స్ కి పార్ట్- 2 శౌర్యంగ పర్వం పై అప్పుడే ఆసక్తి నెలకొంది.
సలార్ అసలు కథంతా రెండో భాగంలోనే ఉంది. దీంతో వీలైనంత త్వరగా సలార్ పార్ట్ ను రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. అటు సలార్ కి వస్తున్న రెస్పాన్స్ ని చూసి ప్రశాంత్ నీల్ కూడా పార్ట్ 2 షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.