ఆ స్టార్ హీరో నాకేం క్లోజ్ కాదు!

బాలీవుడ్ న‌టులు షారుక్ ఖాన్- మ‌నోజ్ బాజ్ పాయ్ ఇద్ద‌రూ ఒకేసారి కెరీర్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-01-06 17:30 GMT

స్టార్ హీరోలంతా క‌ష్ట‌ప‌డి పైకి ఎదిగిన వారే. ఒకేసారి ఇండ‌స్ట్రీకొచ్చి స్టార్లు అయిన వారు ఉన్నారు. ఆల‌స్యం గా స‌క్సెస్ అందుకున్న‌వారు ఉన్నారు. ఇక్క‌డ ఎవ‌రి ప్ర‌యాణం వారిది? ప‌రిచ‌యాలు...స్నేహాలు అనేవి కొంత‌వ‌రకే ప‌రిమితం. అటుపై ఎవ‌రి ప్ర‌తిభ‌పై వారు నిల‌దొక్కుకుని ఎద‌గాల్సిందే. అలాంటి బ్యాచ్ మేట్స్ లో వీళ్లిద్ద‌రు కూడా ఉన్నారు. బాలీవుడ్ న‌టులు షారుక్ ఖాన్- మ‌నోజ్ బాజ్ పాయ్ ఇద్ద‌రూ ఒకేసారి కెరీర్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

ప‌రిశ్ర‌మ‌లోకి రాక ముందు ఇద్ద‌రు ఢిల్లీలో యాక్టింగ్ గ్రూప్ లో ప‌నిచేసారు. అక్క‌డ మొద‌లైన ఇద్ద‌రి ప్ర‌స్తానం నేడు ఏ స్థాయికి చేరుకున్నారో తెలిసిందే. ఒకరు కింగ్ ఖాన్ గా బాలీవుడ్ ని ఏల్తుంటో మ‌రోక‌రు గ్రేట్ యాక్ట‌ర్ గా ప‌రిశ్ర‌మ‌ని శాషిస్తున్నారు. అయితే షారుక్ ఖాన్ అంత పేరు మ‌నోజ్ కి రాలేదు. న‌టుడిగా స‌క్సెస్ అవ్వ‌డానికి కూడా చాలా స‌మ‌యం ప‌ట్టింది. షారుక్ ఖాన్ కొన్ని సినిమాల‌తోనే స్టార్ హీరోగా మారితే! మ‌నోజ్ బాజ్ పాయ్ మాత్రం ఆ రేంజ్ కి చేరుకోలేదు. కేవలం ఫేమ‌స్ న‌టుడిగానే మిగిలిపో యారు.

తాజాగా షారుక్ తో త‌న‌కున్న ప‌రిచ‌యం గురించి మ‌నోజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఇద్ద‌రం క్లోజ్ ప్రెండ్స్ కాదంటూ..అత‌డితే కేవ‌లం త‌న‌కు ప‌రిచ‌యం మాత్ర‌మే అన్న‌ట్లు మాట్లాడారు. `మేము బాగా ద‌గ్గ‌రైన స్నేహుతులం కాదు. ఢిల్లీలో ఒకే గ్రూప్ లో ప‌నిచ‌య‌డంతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అత‌డి స్నేహితులు వేరు. నా స్నేహితులు వేరు. ఇద్ద‌రం వేర్వేరు దారులు ఎంచుకున్నాం. మా దారులు ఎప్ప‌టికీ క‌ల‌వ‌వు` అన్నారు.

అంటే ఢిల్లీలో మొద‌లైన ఇద్ద‌రి ప్ర‌యాణం అది కేవ‌లం ఇప్ప‌టికీ ప‌రిచ‌యం గానే...చిన్న స్నేహంగానే ఉంద‌ని మ‌నోజ్ మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య ప్రెండ్ షిప్ ప‌రంగా ఎలాంటి డెవ‌లెప్ మెంట్ లేదని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అంతే కొంద‌రితో దోస్తీ చాలా ఈజీగా కుదురుతుంది. అందుకు ఇద్ద‌రు ఒక‌ర్ని ఒక‌రు బాగా అర్దం కూడా చేసుకోవాలి. అప్పుడే ఆ స్నేహం నిల‌బ‌డుతుంది. క‌ల కాలం సాగుతుంది. షారుక్-మ‌నోజ్ మ‌ధ్య అలాంటి బాండింగ్ ఏ ద‌శ‌లోనూ ఏర్ప‌డిన‌ట్లు లేదు.

Tags:    

Similar News