మీకు దమ్ము ధైర్యం ఉంటేనే ఈ సినిమాని చూడండి!

హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌... ఇలా అన్ని వుడ్‌ ల్లో హర్రర్‌ సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి.

Update: 2024-09-11 10:50 GMT

హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌... ఇలా అన్ని వుడ్‌ ల్లో హర్రర్‌ సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న రాజాసాబ్‌ సినిమాను హర్రర్ సినిమా అంటున్నారు. ఇంకా చాలా హర్రర్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో హర్రర్ సినిమాలు వెన్నులో వణుకు పుట్టించాయి. హిందీలో వచ్చిన పలు హర్రర్ సినిమాలు ముచ్చెమటలు పట్టించాయి. చంద్రముఖి, కాంచన, ముని ఇలా ప్రతి హర్రర్ సినిమా భయపెట్టాయి. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే హాలీవుడ్‌ మూవీ 'ది ఎక్సార్సిస్ట్' ఒక ఎత్తు.

ది ఎక్సార్సిస్ట్ చిత్రం 50 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పట్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాలా దేశాలు ఈ సినిమాలో మరీ హర్రర్ ఎలమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటూ బ్యాన్‌ చేశారు. పెద్ద దేశం అయిన బ్రిటన్ ఈ సినిమాను బ్యాన్‌ చేసిందంటే ఏ స్థాయిలో ఈ సినిమాలోని సన్నివేశాలు భయపెట్టే విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 1973లో కేవలం 23 థియేటర్స్‌ లో విడుదల అయిన ది ఎక్సార్సిస్ట్ చిత్రం కొన్ని రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది.

సినిమా చూసిన వారిలో చాలా మంది ప్రవర్తన విచిత్రంగా అనిపించిందట. కొందరు థియేటర్‌ లోనే వాంతులు చేసుకోవడంతో పాటు, కొందరు సినిమా మధ్యలో ఉండగానే తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వెళ్లి పోయారట. కొందరు సినిమా పూర్తిగా చూసి బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, సంబంధం లేకుండా ప్రవర్తించడం చేసేవారట. అంతటి హర్రర్‌ కాన్సెప్ట్‌ చిత్రం ఇప్పుడు కొత్తగా అమెజాన్‌ ప్రైమ్‌ కి వచ్చింది. 4కే అల్ట్రా హెచ్‌డీ టెక్నాలజీతో ఇప్పుడు ది ఎక్సార్సిస్ట్ అమెజాన్ ప్రైమ్‌ లో అందుబాటులో ఉంది.

గతంతో పోల్చితే ఇప్పుడు పిక్చర్‌ క్వాలిటీ, సౌండ్‌ క్వాలిటీ మరింత బాగుంది అంటూ సినిమా చూసిన వారు కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ లో రెంట్‌ కి అందుబాటులో ఉన్న ఈ సినిమాను చూడాలి అంటే కచ్చితంగా దమ్ము, ధైర్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం వీక్ హార్ట్‌ వాళ్లు అయినా, ఒంటరిగా సినిమా చూసినా ప్రాణాలకే ప్రమాదం అంటూ సినిమాను చూసిన వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అత్యంత భయానక హర్రర్‌ మూవీని చూడాల్సిన అవసరం ఉందా అంటే ఉందని చాలా మంది అంటారు. భయపడుతూ సినిమా చూడటం ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. వారి కోసం ఈ సినిమా ఫుల్ మీల్స్.

Full View
Tags:    

Similar News