RRR: బిహైండ్ అండ్ బియాండ్... ఇలా చేశావేం జక్కన్న?
అందుకే ఆ సినిమా ఆస్కార్ జర్నీని డాక్యుమెంటరీ రూపంలో తీసుకురాబోతున్నారు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళిద ర్శకత్వంలో రూపొంది 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1230 కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇండియన్ సినీ చరిత్రలో ఆస్కార్ సాధించిన సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్ నాటు నాటు నిలవడంతో సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. అందుకే ఆ సినిమా ఆస్కార్ జర్నీని డాక్యుమెంటరీ రూపంలో తీసుకురాబోతున్నారు.
RRR: బిహైండ్ అండ్ బియాండ్ అనే టైటిల్‌తో రాజమౌళి డాక్యుమెంటరీని రూపొందించారు. సినిమాలకు సంబంధించిన సన్నివేశాల గురించి మాట్లాడుతూ ఆస్కార్ అనుభవాలను గురించి మాట్లాడుతూ డాక్యుమెంటరీ సాగింది. సాధారణంగా డాక్యుమెంటరీలు ఓటీటీల ద్వారా వస్తాయి. కానీ ఈ డాక్యుమెంటరీని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాను విడుదల చేసినట్లు భారీ ఎత్తున ఈ డాక్యుమెంటరీన విడుదల చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కానీ పరిమిత థియేటర్‌లలోనే దీని విడుదల ఉండబోతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ డాక్యుమెంటరీని ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు కొన్ని ముఖ్య మెట్రో నగరాల్లో విడుదల చేయడం లేదు. హైదరాబాద్‌లో పరిమిత థియేటర్‌లలో మాత్రమే విడుదల చేయబోతున్నారు. ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది కనుక అన్ని చోట్ల విడుదల చేయడం లేదని తెలుస్తోంది. దాంతో రాజమౌళి పై అక్కడి ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేశారు ఏంటి రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీని వెండి తెరపై చూడాలని ఆశ పడితే మీరు ఇక్కడ విడుదల చేయక పోవడం మాకు నిరాశను కలిగిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు, ప్రపంచంలోని పలు దేశాల ప్రేక్షకులు ఆధరించారు. ఇప్పుడు వారంతా RRR: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ కోసం వెయిట్ చేస్తున్నారు. సినిమాలో కనిపించిన ప్రముఖ నటీనటులు అంతా తమ అభిప్రాయాలను, తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. సెట్స్ లో జరిగిన అల్లరి, యాక్షన్ ఇలా ప్రతి ఒక్కటి డాక్యుమెంటరీలో ఉండబోతుంది.