యూత్ కి పిచ్చెక్కించిన సినిమా మళ్లీ వచ్చింది, చూశారా..!
జాతిరత్నాలు కంటే కూడా ఎక్కువగా మ్యాడ్ సినిమా నవ్విస్తుంది అంటూ చాలా బలంగా నిర్మాత నాగ వంశీ విడుదలకు ముందు చెప్పాడు.
2021 లో జాతిరత్నాలు సినిమా వచ్చింది. ఆ సినిమా స్థాయిలో యూత్ ని ఆకట్టుకునే మూవీ రాలేదు అంటూ యూత్ ఆడియన్స్ ఫీల్ అవుతున్న సమయంలో వచ్చిన మూవీ 'మ్యాడ్'. సంగీత్ శోభన్, నితిన్ నార్నే, రామ్ నితిన్ నటించిన మ్యాడ్ సినిమా ను సితార ఎంటర్‌టైన్మెంట్స్ వారితో కలిసి సాయి సౌజన్య నిర్మించిన విషయం తెల్సిందే.
ఈ సినిమాను మరో జాతిరత్నాలు సినిమా అంటూ ప్రమోషన్ సమయంలో ప్రచారం చేశారు. జాతిరత్నాలు కంటే కూడా ఎక్కువగా మ్యాడ్ సినిమా నవ్విస్తుంది అంటూ చాలా బలంగా నిర్మాత నాగ వంశీ విడుదలకు ముందు చెప్పాడు. అన్నట్లుగానే మ్యాడ్ సినిమా మంచి వినోదాన్ని పంచింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.
బాక్సాఫీస్ వద్ద పోటీ మరియు ఇతర కారణాల వల్ల భారీ వసూళ్లు నమోదు చేయలేదు కానీ కచ్చితంగా పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాలకు చాలా వ్యత్యాసం ఉంది. భారీ ఎత్తున లాభాలు వచ్చాయి అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందింది. థియేట్రికల్ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మ్యాడ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ను థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తున్నారు. నేటి అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ మొదలైన మ్యాడ్ కి భారీ ఎత్తున వ్యూస్ వస్తున్నాయని సమాచారం అందుతోంది. ఈ వీకెండ్ కి మ్యాడ్ కచ్చితంగా టాప్ ట్రెండ్ లో నిలిచే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ లో హిట్ అయింది కనుక ఓటీటీ లో చూసేందుకు గత రెండు మూడు వారాలుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యం లో జనాలు నెట్ ఫ్లిక్స్ కి పరుగులు తీసే అవకాశాలు ఉన్నాయి.