నాని ‘ది ప్యారడైజ్’ రా స్టేట్‌మెంట్.. టీజర్ రచ్చకు డేట్ ఫిక్స్
నేచురల్ స్టార్ నాని వరుసగా బ్లాక్‌బస్టర్స్‌ను అందుకుంటూ తన మార్కెట్ నెంబర్లను కూడా పెంచుకుంటున్నాడు.
నేచురల్ స్టార్ నాని వరుసగా బ్లాక్‌బస్టర్స్‌ను అందుకుంటూ తన మార్కెట్ నెంబర్లను కూడా పెంచుకుంటున్నాడు. 'దసరా' లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత హయ్ నాన్న అంటూ స్వీట్ మెలోడీ సినిమాతో పలకరించాడు. ఆ తరువాత మళ్లీ మాస్ మోడ్‌లోకి వెళ్లి సరిపోదా శనివారం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా నానికి మరో బిగ్ హిట్ గా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా టీమ్ నాని పుట్టినరోజు సందర్భంగా ‘ది ప్యారడైజ్: రా స్టేట్‌మెంట్’ పేరుతో ఒక ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఎర్ర రంగులో పూర్తిగా హింస, తిరుగుబాటు వాతావరణం మధ్యలో నాని పాత్రను సూచించేలా ఉన్న ఈ పోస్టర్, సినిమా ఎలాంటి ఇంటెన్స్ కంటెంట్‌ను చూపబోతోందో స్పష్టంగా చెప్పేస్తోంది.
ముఖ్యంగా మార్చి 3న రా స్టేట్‌మెంట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయడం అభిమానుల్లో హైప్‌ను పెంచింది. నాని ఈ సినిమాలో లీడర్‌గా, తన ప్రజల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తిగా కనిపించనున్నాడని సమాచారం. సరైన ప్యారడైజ్‌ను నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన ఎలాంటి మార్గాన్నైనా ఎంచుకునే క్యారెక్టర్‌లో కనిపించనున్నాడట. నాని మునుపెప్పుడూ లేని విధంగా ఫుల్ మాస్ లుక్‌లో కనబడతాడని అర్ధమవుతుంది.
ఈ పాత్రలో నాని మేనరిజం, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్‌కు పక్కా ఫీస్ట్ ఇవ్వనున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ‘ది ప్యారడైజ్’ కోసం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనిరుధ్ తానేంటో తన మ్యూజిక్ ద్వారా నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా తన కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బమ్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడట.
టీజర్‌లోనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విన్న వెంటనే ఈ సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతుందని అంటున్నారు. సుధాకర్ చెరుకూరి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హై బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అన్ని హంగులు, అత్యున్నత టెక్నీషియన్స్‌తో సినిమా నిర్మాణం జరుగుతోంది. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో మరో పవర్‌ఫుల్ సినిమా వస్తోందనే వార్త అభిమానుల్లో ఎక్సపెక్టేషన్స్‌ను తారాస్థాయికి తీసుకెళ్లింది.
‘ది ప్యారడైజ్’ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్. మార్చి 3న టీజర్ రాబోతుండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఈసారి నాని తన సినిమాతో నెక్స్ట్ లెవెల్ మాస్ అప్పీల్ చూపించబోతున్నాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా నాని కెరీర్‌లో మరో సాలిడ్ బ్లాక్‌బస్టర్ అయ్యేలా అన్ని సెటప్స్ పక్కా గా ఉన్నాయి. మరి ఆడియెన్స్ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.