ఛావా ఎఫెక్ట్.. యావరేజ్ వెబ్ సిరీస్ పై అందరి ఫోకస్

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ కథతో రూపొందిన ఛావా మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Update: 2025-02-25 03:00 GMT

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ కథతో రూపొందిన ఛావా మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన ఆ సినిమాను లక్ష్మణ్ ఉత్కేటర్ అద్భుతంగా తెరకెక్కించారు. క్యాస్టింగ్ తో పాటు ఆయన ఓ రేంజ్ ప్రశంసలు అందుకుంటున్నారు.

బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించుకుని దూసుకుపోతున్న ఛావా కోసం ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. దీంతో ఇప్పుడు శివాజీ సింహాసనం, నిధి అన్వేషణ నేపథ్యంలో రూపొందిన ది సీక్రెట్‌ ఆఫ్‌ ది శిలేదార్స్‌ వెబ్ సిరీస్ పై సినీ ప్రియుల ఫోకస్ పడింది. జియో హాట్‌ స్టార్‌ ఓటీటీలో ది సీక్రెట్‌ ఆఫ్‌ ది శిలేదా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఆదిత్య సర్పోత్థార్‌ దర్శకత్వం వహించిన ఆ సిరీస్ లో రాజీవ్‌ ఖండేల్వాల్‌, గౌరవ్‌ అమ్లానీ, సాయి తమంకర్‌, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించగా.. గత నెల చివర్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. కానీ ఛావా ఎఫెక్ట్ తో అటు జియో హాట్‌ స్టార్‌, ఇటు సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతోంది. దీంతో అనేక మంది సిరీస్ ను చూసి రివ్యూస్ చేస్తున్నారు. మరి సిరీస్ ఎలా ఉంది? నెటిజన్లు ఏమంటున్నారు?

నార్మల్ గా నిధి అన్వేషణ లాంటి స్టోరీస్ ఎప్పుడూ థ్రిల్ అందిస్తాయని.. ఇప్పుడు సీక్రెట్‌ ఆఫ్‌ ది శిలేదార్స్‌ లో అదే రిపీట్ అయిందని చెబుతున్నారు. ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్టోరీ పక్కదారి పట్టించలేదని అంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. ఆడియన్స్ సినిమాలో భాగమవుతారని చెబుతున్నారు.

నిధి దొరికినా, అసలైన శివాజీ సింహాసనం కోసం జరిగే అన్వేషణ మాత్రం పరవాలేదు అని, చివరి రెండు ఎపిసోడ్స్ వావ్ అని చెబుతున్నారు. అదే సమయంలో ఇలాంటి స్టోరీస్ లో స్క్రీన్ ప్లే ఎంతో బాగుండాలని, ఆ విషయంలో కాస్త ఇంకాస్త మెరుగ్గా పని చేయాల్సిందని కామెంట్లు పెడుతున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్నప్పటికీ అవే మైనస్ అని అంటున్నారు. సిరీస్ లో హీరో యాక్షన్‌ కన్నా కూడా తన తెలివి తేటలతో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసాడు.

కానీ అవేమి అంత కొత్తగా ఉండవు. చాలా సీన్ నార్మల్ గా అనిపిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా థ్రిల్ ఫీలింగ్ అనిపించదని అంటున్నారు. సిరీస్ ను చూశాక.. అడ్వెంచర్స్‌ జర్నీని చూసిన అనుభూతి కలుగుతున్నా.. ఓవరాల్ గా మాత్రం యావరేజ్ అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఛావాతోపాటు ది సీక్రెట్‌ ఆఫ్‌ ది శిలేదార్స్‌ వెబ్ సిరీస్ కోసం కూడా చర్చ జరుగుతోంది. రెండూ శివాజీ బ్యాక్ డ్రాప్ తో రావడంతో ఛావా వల్ల యావరేజ్ గా ఉన్న వెబ్ సిరీస్ ను కూడా ఇప్పుడు అంతా చూసేస్తున్నారు.

Tags:    

Similar News