అప్పుడు 2 పిజ్జాల ఖరీదు = ఇప్పుడు రూ.8 వేల కోట్లు
కానీ బిట్ కాయిన్ల విషయంలో గడచిన పది పదిహేను ఏళ్లలో వేల రెట్లు మార్పులు వచ్చాయి.
మన తాతలు, తండ్రులు ఒకప్పుడు వంద రూపాయలు చేతిలో ఉంటే చాలా చేసేవాళ్లం, చాలా చూసే వాళ్లం, చాలా తినేవాళ్లం అంటూ ఉంటారు. అప్పుడు వెయ్యి రూపాయలు అయితే ఇప్పుడు లక్ష రూపాయలతో సమానం అంటూ ఉంటారు. యాబై అరవై ఏళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. అయితే పది పదిహేను ఏళ్ల క్రితంకు ఇప్పటికి ఎక్కువ మార్పు లేదని చెప్పొచ్చు. గడచిన ఇరవై ఏళ్లుగానే ఈ వ్యత్యాసం పెద్దగా మారలేదు. కానీ బిట్ కాయిన్ల విషయంలో గడచిన పది పదిహేను ఏళ్లలో వేల రెట్లు మార్పులు వచ్చాయి. బిట్ కాయిన్ల విలువ ఇప్పుడు భారీగా పెరిగింది.
ఏ స్థాయిలో వ్యత్యాసం పెరిగింది తెలియజేసేందుకు అమెరికన్స్ లాస్లో హనిఎజ్ ఉదాహరణగా చూపిస్తారు. బిట్ కాయిన్ గురించి తెలిసిన వారికి లాస్లో హనిఎజ్ గురించి తెలిసి ఉంటుంది. ఎందుకంటే లాస్లో దాదాపు 15 ఏళ్ల క్రితం తన వద్ద ఉన్న 10 వేల బిట్‌కాయిన్లను కేవలం రెండు పిజ్జాల కోసం 41 డాలర్లకు అమ్మేశాడు. 10 వేల బిట్‌కాయిన్లను 41 డాలర్లకు అమ్మడం, ఆ వచ్చిన డబ్బుతో రెండు పిజ్జాలు కొనుగోలు చేసి తినడం చేశాడు. 2010 మే 17న 10 వేల బిట్‌కాయిన్లను అమ్మేసిన లాస్లో మే 22న 2 పిజ్జాలను ఆర్డర్ చేశాడు. ఇప్పుడు అతడు అత్యంత దురదృష్టవంతుడు అంటూ మొత్తం బిట్‌కాయిన్ ప్రపంచం అంటోంది.
అప్పుడు కేవలం 2 పిజ్జాల కోసం 10 వేల బిట్‌కాయిన్లను అమ్మేసిన అతడు ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. అప్పుడు 10 వేల బిట్ కాయిన్ల రేటు కేవలం 41 డాలర్లు కాగా, ఇప్పుడు ఆ 10 వేల బిట్ కాయిన్ల ధర ఏకంగా ఇండియన్ కరెన్సీలో రూ.8 వేల కోట్లు ఉంది. అతడు బిట్‌కాయిన్‌కి ఈ స్థాయిలో డిమాండ్ పెరుగుతుందని కనీసం కలలో అయినా ఊహించి ఉండడు. అప్పట్లో తక్కువ రేటుకు కొనుగోలు చేసిన అతడు అంతే తక్కువ రేటుకు బిట్‌కాయిన్‌ను అమ్మేయడం ద్వారా పెద్దగా నష్టపోలేదు. కానీ ఇప్పటి వరకు వాటిని ఉంచుకుని ఉంటే అమెరికాలోనే టాప్ ధనవంతుల జాబితాలో నిలిచే వాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఐటీ ప్రోగ్రామర్ అయిన లాస్లో అప్పట్లో ఆసక్తితో బిట్ కాయిన్లను కొనుగోలు చేశాడు. వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందని అతడు అప్పట్లో భావించలేదు. అందుకే పిజ్జాలు కొనుగోలు చేయడం కోసం అతడు వాటిని అమ్మేశాడు. అందుకే మే 22ను బిట్‌కాయిన్ పిజ్జా డేగా అమెరికాలో జరుపుకుంటారు. ఆ రోజున పిజ్జాలకు హోటల్స్ వారు బిట్ కాయిన్ ఉన్న వారికి కొంత మొత్తంలో డిస్కౌంట్ సైతం ఇస్తారు. అదృష్టం అనేది తలుపు తట్టే వరకు వెయిట్ చేయాలి. తొందర పడితే లాస్లో మాదిరిగా చాలా పెద్ద నష్టం చవిచూడాల్సి ఉంటుంది. దేనికి వెంటనే ఫలితం, ప్రభావం ఉండదు. కనుక ఎదురు చూస్తే తప్పు లేదు.