పుకార్లకు తెర దించిన అందాల తార
ఇప్పటికి కూడా ఆ సిరీస్ సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది.
హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సిడ్నీ బెర్నిస్ స్వీనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హెచ్‌బీఓ డ్రామా సిరీస్ యుఫోరియా తో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికి కూడా ఆ సిరీస్ సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది.
తాజాగా ఈ అందాల రాశి గురించి పుకారు ఒకటి ప్రపంచవ్యాప్తంగా తెగ ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే... జానీ డెప్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'డే డ్రింకర్' లో హీరోయిన్ గా సిడ్నీ స్వీనీ ని ఎంపిక చేశారని, ఆయతో నటించేందుకు సిడ్నీ చాలా ఆతృతగా ఉందని పుకార్లు షికార్లు చేశాయి.
డే డ్రింకర్ సినిమా లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై సిడ్నీ స్పందించింది. తాను ఆ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నా గురించి చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. వాటన్నింటిని వదిలేయండి. మీరు మాత్రం థియేటర్ కు వెళ్లి నా తాజా మూవీ 'ఇమ్మాక్యులేట్' ను చూసి ఎంజాయ్ చేయండి అంది.
దశాబ్ద కాలంగా హీరోయిన్ గా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మరియు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్న సిడ్నీ స్వీనీ హాలీవుడ్ స్టార్ అయిన జానీ డెప్ తో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు రావడంతో చాలా మంది డే డ్రింకర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు. కానీ ఆమె పుకార్లే అని చెప్పడం తో అంతా కూడా ఉసూరు మంటున్నారు.