అంజలిపై ఇంట్లో వాళ్లకు అంత నమ్మకమా!
మొదట్లో ఇలాంటి గాసిప్ లు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు కంగారు పడేవారు.
అంజలి అలియాస్ సీతమ్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడి కెరీర్ సంగతి పక్కనబెడితే ప్రేమ వ్యవహారా ల్లోనూ కొన్నాళ్ల పాటు బాగానే హాట్ టాపిక్ అయింది. కోలీవుడ్ నటులతో అంజలి డీప్ లవ్ లో ఉందని...సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ పెళ్లిళ అంశంపై అంజలి స్పందించింది. ` `సోషల్ మీడియా ఇప్పటికే మూడు-నాలుగు సార్లు పెళ్లిచేసేసింది. మొదట్లో ఇలాంటి గాసిప్ లు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు కంగారు పడేవారు.
ఇదంతా నిజంగా జరుగుతుందా? అని ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని ఇంటికి తీసుకెళ్లి ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో వాళ్లు లేరు. అంతగా నా పెళ్లి విషయంలో ఓ క్లారిటీతో ఉన్నారు. అలాగని నేను పెళ్లి చేసుకోను అని కాదు. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి మీద నేను కూడా అందరి ఆడపిల్లల్లా పాజిటివ్ ఒపినియన్ తోనే ఉన్నాను.
కానీ అందుకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే సినిమాల మానేస్తాను అని అనుకుంటున్నారేమో. ఆ ఛాన్సే లేదు. పెళ్లి చేసుకున్నా నటిగా కొనసాగుతా` అని తెలిపింది. ఇక అంజలి కెరీర్ మళ్లీ టాలీవుడ్ లో స్పీడప్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొత్త అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`లో నటిస్తోంది.
అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న `గేమ్ ఛేంజర్` లో సెకెండ్ లీడ్ పోషిస్తోంది. అమ్మడి కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా విజయం సాధిస్తే అమ్మడి రేంజ్ మారిపోతుంది. ఈ సినిమాపై అంజలి కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఆ రకంగా అమ్మడు కోలీవుడ్...టాలీవుడ్ లో బాగానే ఫేమస్ అయింది. ఇతర భాషల్లోనూ వస్తోన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది. బాలీవుడ్ ఛాన్సుల కోసం ఎదురు చూస్తుంది.