డార్లింగ్.. రిలీజ్ కు ముందే మంచి లాభాలు

విడుదల తేదీకి ముందే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మంచి వ్యాపారాన్ని కూడా చేసింది.

Update: 2024-07-18 09:11 GMT

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందిన 'డార్లింగ్' సినిమా ఈవారం గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రం, నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి మరియు శ్రీమతి చైతన్య పతాకంపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మితమైంది. విడుదల తేదీకి ముందే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మంచి వ్యాపారాన్ని కూడా చేసింది.


డార్లింగ్ చిత్రం విడుదలకు ముందే పలు చోట్ల ప్రీమియర్లు వేసేందుకు సిద్ధమవడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ చూపిన ప్రతీ ఫ్రేమ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించబోతుందనే సంకేతాలను ఇస్తోంది. ప్రియదర్శి మరియు నభా నటేష్ కాంబినేషన్, కామెడీ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ఈ చిత్రం, ప్రస్తుత ఆడియన్స్‌కు కావలసిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ సాధించడం విశేషం. థియేట్రికల్ హక్కులు 7 కోట్ల రూపాయలకు విక్రయించబడగా, నాన్-థియేట్రికల్ హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. మొత్తం 15 కోట్ల రూపాయల బిజినెస్‌తో నిర్మాతలు మంచి లాభాలను పొందారు. విడుదలకు ముందే ఈ స్థాయి వ్యాపారం సాధించడం సినిమాపై ఉన్న ఆసక్తిని మరియు ప్రేక్షకుల అంచనాలను స్పష్టం చేస్తోంది.

'డార్లింగ్' చిత్రంలో ప్రియదర్శి మరియు నభా నటేష్ కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దర్శకుడు అశ్విన్ రామ్ మొదటిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టినా, ఆయన ప్రతిభను ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది. ప్రియదర్శి కామెడీ టైమింగ్, నభా నటేష్ గ్లామర్, వీరి మధ్య ఉండే రొమాన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని అర్ధమవుతుంది.

ఇటీవలి కాలంలో ప్రేక్షకులకు సరైన వినోదం అందించే సినిమాల కొరత ఉండగా, డార్లింగ్ చిత్రం ఆ లోటును తీర్చే ప్రయత్నం చేస్తోంది. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం కావడంతో, అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు రప్పించేందుకు ఈ చిత్రం మంచి అవకాశాలను అందిస్తుంది. మొత్తం మీద, 'డార్లింగ్' చిత్రం టేబుల్ ప్రాఫిట్ సాధించడం, విడుదలకు ముందు పాజిటివ్ బజ్ అందుకోవడం నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. ఇక మేకర్స్ కు టాలీవుడ్‌లో మరొక హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.

Tags:    

Similar News