టాలెంటెడ్ డైరెక్టర్.. నెక్స్ట్ ఏంటీ?

ఇప్పటి వరకు తీసింది తక్కువ చిత్రాలు అయినా అందులో ముత్యాల్లాంటి మూవీస్ ఉన్నాయి.

Update: 2024-10-13 22:30 GMT

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మూవీ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. ఆయన తీసిన సినిమాలు.. ఆలోచింపజేసి తెలియని భావోద్వేగానికి గురి చేస్తాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటి వరకు తీసింది తక్కువ చిత్రాలు అయినా అందులో ముత్యాల్లాంటి మూవీస్ ఉన్నాయి.


క్రిష్ సినిమాల్లో సామాజిక అంశాలు ఫుల్ గా ఉంటాయి. అందుకే హీరోలను సరికొత్తగా చూపిస్తుంటారు. దీంతో ఆయనతో వర్క్ చేసేందుకు అంతా మొగ్గు చూపిస్తుంటారు. ముందు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఛాన్స్ ఇస్తుంటారు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్‌, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో తానేంటో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు క్రిష్. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు, కొండపొలంతో నిరాశపరిచారు.

అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం అందుకున్నారు క్రిష్. ఆ సమయంలో ఒకింత అంతా షాక్ కు గురయ్యారు. కొన్నేళ్ల క్రితం స్టార్ట్ అయిన హరిహరవీరమల్లు షూటింగ్ ఇప్పటికీ జరుగుతుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొన్ని రోజుల క్రితం.. ఆ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారు. అందుకు కారణాలు మాత్రం ఎవరికీ తెలియదు. ఆయన ప్లేస్ లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ.. దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు.

అయితే క్రిష్ తప్పుకోవడం వెనుక చాలా రూమర్స్ అప్పట్లో చక్కర్లు కొట్టాయి. కానీ ఎక్కడా ఎప్పుడూ ఆయన స్పందించలేదు. తన అప్ కమింగ్ మూవీతో బిజీ అయిపోయారు. సీనియర్ హీరోయిన్ అనుష్కతో ఘాటీ మూవీ షూటింగ్ ను సైలెంట్ గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సినిమా ప్రకటన కన్నా ముందే ఘాటీ డిజిటల్ హక్కులు అమ్ముడుపోయాయి. దీంతో మూవీ కాన్సెప్ట్ ఎంతో బాగుందో ఈజీగా తెలుస్తోంది!

ఇప్పుడు ఘాటీ వర్క్స్ చివరి దశకు రాగా.. త్వరలో విడుదల కానుంది. మరి క్రిష్ నెక్స్ట్ ఎవరితో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు క్రిష్ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. మీడియం రేంజ్ హీరోతో వర్క్ చేయాలని ఆయన చూస్తున్నారట. క్రిష్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని ఉన్నారని టాక్. త్వరలోనే తన కొత్త సినిమాను అనౌన్స్ చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News