వాళ్ల ట్యాలెంట్ పై వాళ్లకే నమ్మకం లేదా?
యానిమల్ కి కంటున్యూటీగా యానిమల్ పార్క్ ప్రకటించడం.
బాలీవుడ్ స్టార్ హీరోలంతా సౌత్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు! అన్నది పచ్చి వాస్తవం. షారుక్ ఖాన్ అట్లీతో పని చేయడం...అమీర్ ఖాన్ రాజమౌళి కోసం ఎదురు చూడటం... రణబీర్ కపూర్ సందీప్ రెడ్డితో పనిచేయడం.. యానిమల్ కి కంటున్యూటీగా యానిమల్ పార్క్ ప్రకటించడం..ఎప్పుడూ ముంబైని వదిలి రాని హీరోలంతా హైదరా బాద్లో ప్రత్యక్షమ్వవడం... టాలీవుడ్ స్టార్ హీరోలకు బాలీవుడ్ లో పెద్ద పీట వేయడం... ప్రశాంత్ నీల్...రిషబ్ శెట్టి లాంటి ట్యాలెంటెడ్ మేకర్స్ తో పనిచేయడానికి ఇతర హీరోలంతా ఆసక్తిగా ఉండటం.
ఇవన్నీ చూస్తుంటే? బాలీవుడ్ ట్యాలెంట్ పై సందేహం రావడంలో తప్పేం లేదు కదా? టాలీవుడ్ లో హీరోలు బాలీ వుడ్ లో సినిమాలు చేయాలి గానీ అక్కడ దర్శక, నిర్మాతలంతా రెడీగా ఉన్నారు. కానీ మన నటులే అక్కడికి కదలడం లేదు. అదే బాలీవుడ్ హీరోలంతా టాలీవుడ్ మేకర్స్ తో పనిచేయడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తారు. ఇది చాలదా? సౌత్ ...టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ రేంజ్ కి చేరిందని చెప్పడానికి. పాన్ ఇండియాలో టాలీవుడ్ ట్యాలెంట్ చూసి వాళ్లే పరిగెత్తుకుని వస్తున్నారు.
ఇక్కడ నుంచి రిలీజ్ అయిన కంటెంట్ పాన్ ఇండియాలో వందల..వేల కోట్లు వసూళ్లు సాధించడంతోనే ఇది సాధ్యమైంది. బాలీవుడ్ తో పోల్చుకుంటే? సౌత్ మేకర్స్ ఎంతో అడ్వాన్స్ గా సినిమాలు తీస్తున్నారు. కంటెంట్ ని పాన్ ఇండియాకి కనెక్ట్ చేయడంలో మనోళ్లు ఇప్పుడు మాస్టర్లు అయిపోయారు. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, చందు మొండేటి, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి లాంటి వారు ఇందులో ముందున్నారు. బాలీవుడ్ లోనూ ఎంతో మంది ట్యాలెం టెడ్ దర్శకులున్నారు.
కానీ వాళ్ల కథలు పాన్ ఇండియాకి కనెక్ట్ అవ్వడంలో ఎక్కడో తప్పిదం జరుగుతోంది. సంజయ్ లీలాభన్సాలీ, రాజ్ కుమార్ హిరాణీ, ఆయాన్ ముఖర్జీ, సిద్దార్ధ్ ఆనంద్, కపూర్ లు, ఖాన్ లు లాంటి వాళ్లు ఉన్నా? వాళ్ల కథలు సౌత్ లో అనుకున్నంతగా కనెక్ట్ అవ్వడం లేదు. దీంతో స్టార్ హీరోలంతా టాలీవుడ్..కోలీవుడ్ దర్శకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా అక్కడ హీరోలు ఇటుగా రావడంతో సొంతం ఇండస్ట్రీ ట్యాలెంట్ పై వాళ్లకే నమ్మకం లేదనే వాదనా తెరపైకి వస్తోంది. మరి దీని గురించి బాలీవుడ్ ఏమంటుందో.