ఈ వారం ఓటీటీ.. క్రేజీ కంటెంట్

ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వస్తూ ఉంటాయి.

Update: 2024-09-22 11:03 GMT

ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని మాత్రమే వీక్షకులని అలరిస్తాయి. భాషా పరిమితి లేకపోవడంతో వరల్డ్ వైడ్ గా ఇతర లాంగ్వేజ్ లలో వచ్చే కంటెంట్ లకి కూడా ఇండియాలో ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేవారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఇక ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లలో మంచి కథ, కథనాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న వాటి జాబితాలో ప్రధానంగా మూడు కనిపిస్తున్నాయి.

వాటిలో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ‘మన్ స్టర్స్’ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కథలు ఇష్టపడే ప్రేక్షకులకి ఈ వెబ్ సిరీస్ విపరీతంగా నచ్చుతుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచి కథాంశం ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ధనవంతులైన తల్లిదండ్రులు మాఫియా చేతిలో హత్యకి గురవుతారు. తల్లిదండ్రుల మరణంపై వారి ఇద్దరు పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు. అలాగే తల్లిదండ్రుల చంపిన వారిపై ఏ విధంగా రివేంజ్ తీసుకున్నారు అనే ఎలిమెంట్స్ తో ఈ వెబ్ సిరీస్ కథనం ఉంటుంది.

మొదటి ఎపిసోడ్ లో మొదటి సీన్ తోనే ప్రేక్షకులు కథకి కనెక్ట్ అయిపోతారు. హత్యచేసిన వారు ఎవరనేది మొదటి ఎపిసోడ్ లోనే రివీల్ అయిపోతుంది. అయితే వారిని అన్నదమ్ములు ఇద్దరు ఎలా పట్టుకున్నారు అనేది ఇంటరెస్టింగ్ గా నడిపించారు. ఇక ఇంగ్లీష్ వచ్చిన ‘హిజ్ త్రీ డాటర్స్’ అనే మూవీ ఎమోషనల్ డ్రామాతో ఉంటుంది. స్లో నేరేషన్ తోనే కథాంశం స్టార్ట్ అయిన మెల్లగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. డ్రామా ఇష్టపడేవారికి ఈ మూవీ బాగా నచ్చుతుందనే మాట వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక తెలుగులో రావు రమేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రియలిస్టిక్ కామెడీ కథలు ఇష్టపడే వారికి ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ బాగా నచ్చుతుంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఎక్కువ మంది ప్రేక్షకులు వీటిని వీక్షిస్తున్నారు.

Tags:    

Similar News