ఈ వారం చోటా సినిమాలే.. హిట్టు ఎవరికో..
ఈ నెల ఆరంభంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.
ఈ నెల ఆరంభంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 12 శుక్రవారం గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫలితం ఏంటనేది ఈ రోజు వచ్చే కలెక్షన్స్ బట్టి తెలిసిపోతుంది. గత నెల ఆఖరులో వచ్చిన టిల్లు స్క్వేర్ హవానే ఇంకా నడుస్తోంది. ఆడియన్స్ ని స్ట్రాంగ్ గా హోల్డ్ చేసే మూవీస్ అయితే ఏప్రిల్ మొదటి, రెండు వారాలలో పడలేదని చెప్పాలి.
ఈ వీకెండ్ లో కూడా చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏవీ థియేటర్స్ లోకి రావడం లేదు. చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. క్యాస్టింగ్ పరంగా ఆయా చిత్రాలు జనాలకి రీచ్ అయ్యేలానే ఉన్నాయి. అయితే కంటెంట్ తో ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తారనే దాని మీద సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సత్యం రాజేష్ లీడ్ రోల్ లో చేస్తోన్న టెనెంట్ అనే మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతోంది.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ ఉండబోతోంది. అలాగే శశివదనే అనే మూవీ కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రక్షిత్ అట్లూరి ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ చాలా సార్లు వాయిదా పడి ఫైనల్ గా థియేటర్స్ లోకి ఏప్రిల్ 18న రాబోతోంది. చైతన్య రావు, సునీల్ లీడ్ రోల్ లో నటించిన క్రైమ్ కామెడీ మూవీ పారిజాతాపర్వం ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మూవీని ప్రమోషన్స్ లో ఆడియన్స్ కి ఎంత బెటర్ గా రీచ్ చేస్తారనే దానిని బట్టి పారిజాతాపర్వం రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. చాలా ఏళ్ళ తర్వాత నవదీప్ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కల్ట్ అండ్ బోల్డ్ లవ్ స్టోరీతో లవ్ మౌళి అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమా కూడా ఏప్రిల్ 19న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ని మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ మూవీలో నవదీప్ గెడ్డంతో కంప్లీట్ న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇవన్నీ చిన్న సినిమాలుగా 10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కినవే కావడం విశేషం. మరి వీటిలో ఒక్క సినిమా అయిన ఆడియన్స్ ని మెప్పించి సక్సెస్ బాట పడుతుందేమో అనేది చూడాలి. ఆయా చిత్ర యూనిట్ లు అయితే మూవీ అవుట్ ఫుట్ లపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.