కొడితే కోట్లొచ్చి పడాల్సిందే..!

ఇలా తెలుగు నుంచి 3, తమిళ్ నుంచి రెండు భారీ సినిమాలు పాన్ ఇండియా రేసులో తమ సత్తా చాటేందుకు వస్తున్నాయి.

Update: 2024-09-22 10:30 GMT

2024 లో ఇప్పటివరకు సినిమాల పండగ ప్రేక్షకులకు సగం సంతృప్తినే అందించిందని చెప్పొచ్చు. ఐతే రాబోతున్న మూడు నాలుగు నెలల్లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, తమిళం నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమాలపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ముందుగా ఈ నెల చివరన అంటే మరో ఐదురోజుల్లో ఎన్టీఆర్ దేవర ఆగమనం జరుగుతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర మొదటి పార్ట్ భారీ టార్గెట్ తో వస్తుంది.

సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా రీసెంట్ గా సినిమా చూసిన సెలబ్రిటీస్ కొందరు సినిమా నెక్స్ట్ లెవెల్ అనేస్తున్నారు. ఇక పాన్ ఇండియా లెవెల్ లో దేవర సంచలనాలు సృష్టించేందుకు వస్తుంది. అక్టోబర్ 10 దసరా రేసులో సూపర్ స్టార్ రజిని వేటయ్యన్ కూడా భారీ అంచనాల మధ్య వస్తుంది. ఈ సినిమాను టీ జే జ్ఞానవెల్ డైరెక్ట్ చేశారు. రజినీతో పాటు అమితాబ్, రానా, ఫాహద్ ఫాజిల్ నటించడంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కంగువ మీద కూడా భారీ హైప్ ఏర్పడింది. పాన్ ఇండియా లెవెల్ లో నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాతో సూర్య భారీ కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. సినిమాలో విలన్ గా యానిమల్ స్టార్ బాబీ డియోల్ నటించడం కలిసి వచ్చే అంశమని చెప్పొచ్చు. ఇక డిసెంబర్ రేసులో పుష్ప రాజ్ వస్తున్నాడు. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 మీద భారీ క్రేజ్ ఏర్పడింది.

సుకుమార్ ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 6న పుష్ప 2 వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ బాగుంది. సినిమా అనుకున్నట్టు ఉంటే మాత్రం ఊహించని విధంగా వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. డిసెంబర్ చివర్లో క్రిస్మస్ రేసులో రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఇలా తెలుగు నుంచి 3, తమిళ్ నుంచి రెండు భారీ సినిమాలు పాన్ ఇండియా రేసులో తమ సత్తా చాటేందుకు వస్తున్నాయి. ఈ సినిమాలతో కోట్లు కుమ్మేసేందుకు సిద్ధం అవుతున్నారు స్టార్స్. మరి వీటిలో ఏది అంచనాలను మించి ఆడుతుంది. ఏ సినిమా ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News