ఓటీటీలోకి థ్రిల్లింగ్ 'విధి'.. మంచు విష్ణు స్పెషల్ ట్వీట్

యువ నటీనటులు రోహిత్ నందా, ఆనంది హీరోహీరోయిన్లుగా ఈ మూవీలో నటించారు.

Update: 2024-01-26 16:15 GMT

ఈరోజుల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రొటీన్ స్టోరీతో ఉన్న కమర్షియల్ సినిమాలను చూడడం తగ్గించేశారని చెప్పొచ్చు. అందుకే చిన్న బడ్జెట్ సినిమాలు అయినా కొత్త కాన్సెప్ట్‌ తో తెరకెక్కించాలని చూస్తున్నారు మేకర్స్. అలాంటి కాన్సెప్ట్‌ తోనే తెరకెక్కిన చిత్రం విధి. గతేడాది రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.


యువ నటీనటులు రోహిత్ నందా, ఆనంది హీరోహీరోయిన్లుగా ఈ మూవీలో నటించారు. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్. 2023 నవంబర్ 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఓటీటీలో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. రిపబ్లిక్ డే కానుకగా తాజాగా ఓటీటీలోకి వచ్చేసిందీ సినిమా. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఓటీటీలో విధి సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు. "నా సోదరుడు రోహిత్ నటించిన విధి మూవీకి శుభాకాంక్షలు! ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆల్రౌండ్ ఎంటర్టైనర్ ను తప్పక చూడండి" అంటూ విష్ణు ట్వీట్ చేశారు. దీంతోపాటు ప్రైమ్ వీడియోలోని విధి మూవీని లింక్ కూడా యాడ్ చేశారు.

కథేంటంటే?

సూర్య (రోహిత్ నందా) ఓ అమాయకపు కుర్రాడు. సొంత ఊర్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, జాబ్ కోసం సిటీకి వస్తాడు. అక్కడ తన ఫ్రెండ్స్ రూమ్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా.. ఒకరోజు అతడు ఓ వ్యక్తి వద్ద పెన్ చూసి ఇంప్రెస్ అవుతాడు. అయితే దాని విలువ రూ.40 వేలు అని అతడు చెప్పగా విని షాక్ అవుతాడు. తర్వాత ఊహించని విధంగా అతడికి అలాంటి పెన్ ఒకటి దొరుకుతుంది. ఆ పెన్ ను అమ్మేసి క్యాష్ చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ పెన్ను కొనుక్కోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఆ తర్వాత ఆ పెన్ తో ఎవరు రాస్తే వాళ్లు చనిపోతూ ఉంటారు.

ఈ క్రమంలో తన ఇద్దరు స్నేహితులను పోగొట్టుకుంటాడు సూర్య. ఫైనల్ గా ఈ విషయం అతడికి అర్ధమవుతుంది. మరోవైపు తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన అమ్మాయి (ఆనంది) ని సూర్య ప్రేమిస్తూ ఉంటాడు. కొన్నేళ్ల తర్వాత కలుసుకున్నప్పటికీ వీరిద్దరూ తమ ప్రేమ గురించి చెప్పుకోరు. ఈ క్రమంలో ఆ పెన్ వల్ల.. సూర్య లైఫ్ లో ఇంకొన్ని పెను మార్పులు జరుగుతాయి. మరి అతడి లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందా? అసలు ఆ పెన్ వెనుక ఉన్న కథేంటి? అ పెన్ ను సూర్య ఏం చేశాడు? అనేది మిగిలిన సినిమా.

నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎస్. రంజిత్ ఈ మూవీని నిర్మించారు. శ్రీనాథ్ రంగనాథన్ కేవలం ఈ సినిమాకు రచన చేయడం మాత్రమే కాకుండా కెమెరామెన్ బాధ్యతను కూడా స్వీకరించారు. దర్శకుడిగా శ్రీకాంత్ వ్యవహరించారు. ఎన్నో యూత్‌ఫుల్ సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల. బాణీలు కట్టారు. అయితే ఈ సినిమాను ఆడియో డిస్క్రిప్టివ్‌ టెక్నాలజీతో రూపొందించారు. దీంతో కంటి చూపు లేనివాళ్లు కూడా ఈ మూవీని అనుభూతి చెందగలరు. మరి ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

మూవీ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


Tags:    

Similar News