సూపర్ హిట్ మూవీ రీరిలీజ్.. ఆ రికార్డులన్నీ బ్లాస్ట్

వెలవెలబోయిన థియేటర్లకు మళ్లీ రిలీజ్ అవుతున్న సినిమాలు ఊపిరిపోస్తున్నాయి.

Update: 2024-09-11 17:58 GMT

ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. తమ హిట్ సినిమాలను థియేటర్లలో రెండోసారి రిలీజ్ చేసేందుకు అనేక మంది హీరోలు మొగ్గు చూపుతున్నారు. బర్త్ డేస్, స్పెషల్ డేస్ సందర్భంగా ఇప్పటికే ప్రేక్షకులను అలరించిన సినిమాలు.. మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. భారీ వసూళ్లు సాధిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. వెలవెలబోయిన థియేటర్లకు మళ్లీ రిలీజ్ అవుతున్న సినిమాలు ఊపిరిపోస్తున్నాయి.

టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ ఇప్పటికే కొత్త ఒరవడి సృష్టించగా.. ఇప్పుడు మిగతా లాంగ్వేజెస్ లో కూడా అదరగొడుతున్నాయి. అవినాష్ తివారి, త్రిప్తి డిమ్రీ కాంబోలో 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైలా మజ్ను మూవీ రీసెంట్ గా బాలీవుడ్ లో రీరిలీజ్ అయింది. అప్పుడు రూ.2.89 కోట్లు వసూలు చేసిన ఆ సినిమా.. రీరిలీజ్ లో రూ.8 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఐదు వారాలుగా సత్తా చాటుతున్న ఆ మూవీ.. త్వరలో రూ.10 కోట్ల మార్కు అందుకోనుంది.

ఆర్ మాధవన్, దియా మీర్జా యాక్ట్ చేసిన రెహనా హై టెర్రీ దిల్ మూవీ.. 23 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు ఇటీవల వచ్చింది. అప్పట్లో రూ.5.5 కోట్లు రాబట్టిన ఆ సినిమా.. ఇప్పుడు అంతకుమించి కలెక్షన్స్ ను రాబట్టేలా కనిపిస్తోంది. మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. లైలా మజ్ను మూవీ లాగానే వసూళ్లను సాధిస్తోంది. ఇప్పుడు సూపర్ హిట్ తుంబాద్ సినిమా రీరిలీజ్ కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

రీసెంట్ గా మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా.. ఓ రేంజ్ లో సేల్స్ జరుగుతున్నాయి. సినీ ప్రియులు.. పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తుంబాద్ మూవీ రీరిలీజ్.. గత ఐదేళ్ల బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినీ ప్రియులు దూకుడు చూసి మరిన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. షోస్ కూడా భారీ పెంచుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటి వరకు రీరిలీజ్ ట్రెండ్ లో నమోదైన రికార్డులన్నింటినీ తుంబాద్ బ్రేక్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. లైలా మజ్ను, రెహనా హై టెర్రీ దిల్.. వసూళ్ల కన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏదేమైనా మంచి సినిమాలు లేక కొన్ని రోజుల పాటు థియేటర్లు వెలవెలబోయినా.. ఇప్పుడు రీరిలీజ్ అయిన సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News