వెంకటేష్ సినిమాకు పెంచేశారోచ్..!
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు మాత్రమే కాదు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కూడా ఏపీలో టికెట్ రేట్లు పెంచారు.
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో జనవరి 14న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం కామనే. తెలంగాణాలో కేవలం ఒక్క రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి మాత్రమే టికెట్ రేట్లు పెంచారు. ఆ సినిమాతో పాటు వస్తున్న డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు టికెట్ రేట్లు పెంచలేదు.
ఐతే ఏపీలో మాత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచారు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు మాత్రమే కాదు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కూడా ఏపీలో టికెట్ రేట్లు పెంచారు. ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 125 రూపాయల దాకా పెంచారు. పెరిగిన టికెట్ రేట్లతో సింగిల్ స్క్రీన్స్ లో 245, మల్టీప్లెక్స్ లో 300 రూపాయలు చేశారు.
పెరిగిన టికెట్ రేట్లు 10 రోజుల దాకా ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు సినిమాకు ఐదు షోల పర్మిషన్ ఇచ్చినట్టు సమాచారం. సంక్రాంతికి ఆంధ్రాలో సందడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సినిమాలకు కూడా ఐదు షోలు ఇంకా పెంచిన టికెట్ రేట్లతో సినిమాలకు మంచి లాభం చేకూరే ఛాన్స్ ఉంటుంది. ఇక తెలంగాణాలో మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా ఒక్క దానికే స్పెషల్ పర్మిషన్ కింద టికెట్ రేట్లు పెంచడమే కాకుండా సెలెక్టెడ్ థియేటర్స్ లో మొదటి రోజు ఆరు షోల పర్మిషన్ ఇచ్చారు.
సంక్రాంతి సినిమాల్లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పోటీ పడుతున్నాయి. 3 సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఐతే మాస్ యాక్షన్ క్లాస్ అంటూ మూడు సినిమాలు వేరు వేరు జోనర్ లలో రావడం మూడింటికి ఆడియన్స్ ఆసక్తి చూపించే అవకాశం ఉంది. సంక్రాంతి పండగ ఓ వైపు కొత్త సినిమాల సందడి మరో వైపు సో తమ సంతోషాన్ని సినిమా చూసి మరింత పెంచుకునేలా ప్రేక్షకులు థియేటర్ బాట పడతారు. ఐతే ముందు ఈ 3 సినిమాల్లో హిట్ టాక్ వచ్చిన సినిమా చూసేందుకే ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. ఐతే 3 సినిమాలు మినిమం గ్యారెంటీ అన్నట్టుగానే కనిపిస్తున్నాయి.